ETV Bharat / city

Departmental Exams: ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల‌కు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు.. నోటిఫికేషన్ జారీ - గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్​మెంటల్​ పరీక్షలను నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈనెల 28 నుంచి 30 వరకు నిర్వహించేలా ఏపీపీఎస్​సీ నోటిఫికేషన్ జారీ చేసింది.

Departmental Exams
ఉద్యోగుల‌కు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు
author img

By

Published : Sep 10, 2021, 6:49 PM IST

ఆంధ్రప్రదేశ్​లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్​మెంటల్​ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈనెల 28 నుంచి 30 వరకు నిర్వహించేలా ఏపీపీఎస్​సీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

40 శాతం వస్తేనే...

ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఓటీపీ ద్వారా రిజిస్ట్రేష‌న్ సదుపాయం కల్పిస్తున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఓటీపీఆర్‌లో వ‌చ్చే యూజ‌ర్ ఐడీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవ‌కాశం ఉంటుందని పేర్కొంది. ఈ నెల 13 నుంచి 17 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వంద మార్కుల‌కు 40 మార్కులు వ‌స్తేనే ప్రొబేష‌న‌రీకి అర్హులని నోటిఫికేషన్​లో స్పష్టం చేశారు. వచ్చే నెల 2 నాటికి గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్యవస్థకు రెండేళ్లు పూర్తి కానుంది. ఫలితంగా ఏపీవ్యాప్తంగా 1.34 లక్షల మంది ఉద్యోగులకు ప్రొబేష‌న్ కాలం పూర్తి కానుంది.

ఇదీ చదవండి: SNAKE VIRAL VIDEO: నాగుపాము హల్‌చల్‌.. భయంతో పరుగులు తీసిన జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.