ETV Bharat / city

అనుమతులు లేని పాఠశాలను సీజ్​ చేసిన డీఈవో

కనీస అనుమతులు లేకుండా నడుపుతున్న ఓ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వికారాబాద్​ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటిస్తూ రెండు రోజుల్లో తిరిగి పాఠశాలను ఏర్పాటు చేయని పక్షంలో సీజ్ చేయాలని ఎంఈవో బాబు సింగ్​ను ఆదేశించారు.

అనుమతులు లేని పాఠశాలను సీజ్​ చేసిన డీఈవో
author img

By

Published : Aug 17, 2019, 5:45 PM IST

వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని చిగుర్లపల్లి అపార్ట్​మెంట్​లో ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణవేణి టాలెంట్​ స్కూల్​ పేరిట నడుస్తున్న పాఠశాలను కొందరు వ్యక్తులు కొనుగోలు చేసి, డాక్టర్స్ హైదరాబాద్​ ఇంటర్నేషనల్​ స్కూల్​ పేరుతో విద్యాశాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చిగుర్లపల్లి అపార్ట్​మెంట్​కి మార్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేయలేదని సోషల్​ మీడియాలో హల్​చల్​ కావడంతో డీఈవో రేణుకాదేవి పాఠశాలను సందర్శించారు. కనీస అనుమతులు లేకుండా అపార్ట్​మెంట్​లో పాఠశాలను ఏర్పాటు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో నిబంధనలు పాటించని పక్షంలో పాఠశాల సీజ్ చేయాలని ఎంఈవో బాబు సింగ్​ను ఆమె ఆదేశించారు.

అనుమతులు లేని పాఠశాలను సీజ్​ చేసిన డీఈవో

ఇదీ చూడండి: భారత దౌత్యవేత్తకు పాకిస్థాన్​ సమన్లు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.