ETV Bharat / city

TPCC: టీపీసీసీ అధ్యక్ష వేడి.. ఎంపికపై వీడని ఉత్కంఠ - telangana varthalu

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడి ఎంపిక మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. పంజాబ్​తోపాటు వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించడంపై అధిష్ఠానం దృష్టి సారించింది. ఆ సమస్యలు ఒక కొలిక్కి వచ్చేవరకు తెలంగాణకు కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ప్రకటన ఉండకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

delay in the selection of tpcc president
టీపీసీసీ అధ్యక్ష వేడి.. ఎంపికపై వీడని ఉత్కంఠ
author img

By

Published : Jun 26, 2021, 3:29 PM IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గత కొంత కాలంగా నూతన అధ్యక్షుడి నియామకంపైనే చర్చ జరుగుతోంది. పార్టీలో ఏ నలుగురు ఒక చోట చేరినా ఇదే విషయం చర్చకు వస్తోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ నేతలు, అనుబంధ విభాగాలు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ పార్టీ అధిష్ఠానానికి నివేదించారు. డజనుకు పైగా పీసీసీ పీఠం కోసం పోటీ పడ్డారు. కానీ అందరు పక్కకు పోయి ప్రస్తుతం పోటీలో ఇద్దరు ఎంపీలు మిగిలారు. అది కూడా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మాత్రమే ఉన్నారు. అన్ని స్థాయిల నాయకుల నుంచి సేకరించిన అభిప్రాయాలలో ఎక్కువగా ఎంపీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రేవంత్​ను నియమించొద్దంటూ..

ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకుడు అయినందున పీసీసీ చీఫ్ పదవి కట్ట పెట్టొద్దు అంటూ పార్టీ సీనియర్ నాయకులు కొందరు పదే పదే లేఖలు రాస్తున్నారు. అదేవిధంగా కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా రేవంత్ రెడ్డిని నియమించొద్దంటూ లేఖలు రాసినట్లు తెలుస్తోంది. దీంతో తుదిదశకు చేరుకున్న అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. పార్టీ సీనియర్ నాయకులకు కాల్ చేసి తిరిగి అభిప్రాయాలను తీసుకోవాలని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్​ని అధిష్టానం ఆదేశించింది. దీంతో మాణిక్యం ఠాగూర్​తో సహా ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు బోస్ రాజు, శ్రీనివాస కృష్ణన్​లు రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్య నాయకులకు ఫోన్ చేసి అభిప్రాయాలను తీసుకున్నారు. ముందిచ్చిన, తాజాగా ఇచ్చిన అభిప్రాయ నివేదికలను బేరీజు వేసి, ఏఐసీసీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.

సమస్యలు పరిష్కరించిన తర్వాతే..

ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధిష్ఠానం పంజాబ్ సమస్యతోపాటు, ఇతర రాష్ట్రాల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించిన తర్వాతనే ఇతరత్రా విషయాలపై దృష్టి సారించాలని భావిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన అంతర్గత వివాదాలను పరిష్కరించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఆ తర్వాత అయినా అడుగడుగునా అడ్డు పడుతున్న సీనియర్లను బుజ్జగించి వారిలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి అందరికి ఆమోద యోగ్యమైన నాయకుడి పేరును ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పార్టీ బలోపేతం కోసం..

ఏకాభిప్రాయంతో పీసీసీ నూతన అధ్యక్షుడిని ప్రకటించినట్లయితే సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా అందరూ ఒక్కటైతే పార్టీ బలోపేతం కావడానికి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడానికి అవకాశం ఉంటుందని అధిష్ఠానం భావిస్తోంది. అదే విధంగా రాష్ట్రంలో అధికార తెరాసను, భాజపాను దీటుగా ఎదుర్కొని ముందుకు వెళ్లడానికి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. సామాజిక వర్గాల సమతుల్యత కోసం నాయకులందరికీ సముచిత స్థానం కల్పనకు వివిధ కమిటీల ద్వారా సంతృప్తి పరచాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆచితూచి అధిష్ఠానం అడుగులు

కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని కూడా ప్రకటించిన అధిష్ఠానం టీపీసీసీ ఎంపికలో అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అధ్యక్షుడి ప్రకటన తర్వాత అసంతృప్తితో నాయకులు ఎవ్వరూ పార్టీని వీడకుండా ఉండాలన్న దృష్టితో కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటివరకు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: Uttam Kumar Reddy: కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలు మోసపోతున్నారు: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.