Haryana Governor Bandaru Dattatreya: ప్రతి సంవత్సరం నిర్వహించే అలై బలై కార్యక్రమానికి ఈసారి పెద్ద సంఖ్యలో ప్రముఖులు రానున్నట్లు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆయన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మాసబ్ ట్యాంక్ వద్ద ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పండిత్ దీన్ దయాల్ జయంతి కార్యక్రమంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, చింతల రామచందర్, జగదీష్ రెడ్డితో పాటు పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే అలై బలై కార్యక్రమానికి ఈసారి పెద్ద సంఖ్యలో ప్రముఖులు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పలువురు నేతలకు హర్యానా గవర్నర్ బాధ్యతను అప్పగించి, వారికి దిశా నిర్దేశం చేశారు.
దీన్ దయాల్ ఉపాధ్యాయ గొప్ప దేశ భక్తుడు, తాత్వికవేత్త.. సామాజిక విప్లవకారుడు. ఆయన జీవితమంతా బ్రహ్మచర్యంతో ఉండి నిస్వార్థమైన సేవ చేసి, నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కమ్యూనిజానికి, కేపటలిజానికి ప్రత్యామ్నాయంగా ఏకాంత మానవతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, రాజకీయాల్లో నైతికతను పెంపొందించారు. ఇదే స్ఫూర్తితో అటల్బిహారీ వాజ్పేయి, నేటి ప్రధాని నరేంద్రమోదీ ఆ సిద్ధాంతాలను పాటిస్తున్నారన్నారు. మన విలువలను పరిరక్షించుకుంటే అదే నిజమైన ఘన నివాళీ.- బండారు దత్తాత్రేయ, హరియాణా గవర్నర్
ఇవీ చదవండి: