ETV Bharat / city

తీవ్రంగా మారిన వాయుగుండం.. ఈనెల 26న రాష్ట్రానికి భారీ వర్షసూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుందని హెచ్చరించింది. ఈనెల 26 నుంచి తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది.

cyclone-in-bay-of-bengal
ఈనెల 26న రాష్ట్రానికి భారీ వర్షసూచన
author img

By

Published : Nov 24, 2020, 8:29 AM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రంగా మారింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. చెన్నైకి ఆగ్నేయంగా 470 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. మరికొద్ది గంటల్లో తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం.. తదుపరి 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారుతుందని స్పష్టం చేసింది. 25న సాయంత్రం మమాళ్లపురం - కరైకల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ భావిస్తోంది. తీరం దాటేటప్పుడు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణపై ప్రభావం

తీవ్ర వాయుగుండం ప్రభావంతో.. తమిళనాడులోని కోస్తా జిల్లాలతో పాటు.. ఏపీ రాష్ట్రంలోని దక్షిణకోస్తాకు చెందిన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు... రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. 26 నుంచి తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. కడలూర్‌, విల్లుపురం, పుదుచ్చేరి ప్రాంతాల్లోకి సముద్రపునీరు చొచ్చుకెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడు తీరప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా.. తమిళనాడులో 2 కోస్ట్‌గార్డ్ నౌకలు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.