కరోనా సమయంలో సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అద్భుతమైన సేవలు అందించిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ, పోలీస్, ఐటీ సంస్థలను సమన్వయం చేసుకుని ఈ కౌన్సిల్ పనిచేస్తుందన్నారు. కౌన్సిల్ సేవల గురించి విస్తరించేందుకు తయారీ సంస్థల అధిపతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ పాల్గొన్నారు.
15 సంవత్సరాలుగా సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉత్తమ సేవలు అందించిందని... కేవలం ఐటీ సంస్థలకే పరిమితమైన ఈ కౌన్సిల్ సేవలు వివిధ రంగాలకు విస్తరించనున్నట్టు తెలిపారు. తయారీ, ఫార్మా, ఇన్‌ఫ్రా, హెల్త్‌కేర్ తదితర సంస్థలు కూడా ఈ కౌన్సిల్ ద్వారా సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నందున... ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుంటుందన్నారు. కార్యాక్రమంలో సీపీతోపాటు 150 సంస్థల ప్రతినిధులు, పొలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'సచివాలయం' రాళ్ల కోసం రాజస్థాన్‌కు తెలంగాణ మంత్రి