మీరు ఉపయోగిస్తున్న క్రెడిట్ కార్డు సేవలు మరో 24 గంటల్లో ముగిసిపోతాయి..ఎందుకంటే మీరు కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలు అప్‌డేట్ చేయలేదు. వెంటనే అప్‌డేట్ చేయండి. లేదా క్విక్ సపోర్టు యాప్ డౌన్‌లోడ్ చేయండి, మేమే అప్‌లోడ్ చేస్తాం అంటూ ఓ కస్టమర్‌కు మెసేజ్ వచ్చింది.
ఆ తర్వాత ఒక్క రూపాయి వేరే ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసి చెక్ చేసుకోండి అన్నారు. చివరకు ఖాతాల్లో ఉన్న రూ.మూడు లక్షలు దోచేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి'