ETV Bharat / city

మంత్రా మజాకా..! డబ్బులతో స్వాగతం.. మెప్పుకోసం నోట్లు చల్లిన నేత..

author img

By

Published : Apr 14, 2022, 12:48 PM IST

Minister Viswaroop procession: తమ నేతకు మంత్రి పదవి దక్కిందని కార్యకర్తలు రెచ్చిపోయారు. మంత్రి ఊరేగింపులో సందడి చేశారు. అంతటితో ఆగకుండా.. నడిరోడ్డుపై కరెన్సీ నోట్లు ఇష్టమొచ్చినట్లు విరజిమ్మారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో లేని కొత్త సంప్రదాయానికి తెరతీశారు. అయితే వైకాపా నేతల తీరును పలువురు తప్పుపడుతున్నారు. సంబరాలకు ఓ పరిమితి ఉంటుందని అంటున్నారు.

Minister Viswaroop procession
మంత్రి ఊరేగింపులో నోట్ల కట్టలు

Minister Viswaroop procession: ఆంధ్రప్రదేశ్​లోని కోనసీమ జిల్లా అమలాపురం శాసనసభ్యుడు పినిపే విశ్వరూప్.. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ అనంతరం బుధవారం రాత్రి అమలాపురానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ఊరేగింపులో వైకాపా నాయకుడు, నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్ముల కొండలరావు మంత్రి విశ్వరూప్​కు పూలమాలలు వేసి నడిరోడ్డుపై కరెన్సీ నోట్లు విరజిమ్మిన సంఘటన విమర్శలకు దారి తీసింది. అనంతరం ఆ నోట్లను అక్కడే ఉన్న కార్యకర్తలు పోటీపడి మరీ ఏరుకున్నారు.

మంత్రి ఊరేగింపులో నోట్ల కట్టలు వెదజల్లుతున్న దృశ్యాలు

ఇవీ చదవండి : వీహెచ్‌ ఇంటిపై రాళ్ల దాడి.. కారు ధ్వంసం.. సీసీదృశ్యాలు వైరల్​​..

'మాట్లాడుకోవడాల్లేవ్.. రాజపక్స రాజీనామా చేయాల్సిందే'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.