ఏపీలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో.. కొవిడ్ నియంత్రణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి నుంచి ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలకు అనుమతించనున్నారు. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. దుకాణాలు తెరిచి ఉంచే సమయంలోనూ 144 సెక్షన్ అమలులో ఉంటుంది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు.
కొవిడ్ నియంత్రణపై సీఎం జగన్.. మంత్రులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని వివరించారు. కొవిడ్ నివారణ చర్యలతో పాటు ఆస్పత్రుల్లో బెడ్లు పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు వివరించారు. నిర్ణీత సమయాల్లో కర్ఫ్యూ విధించాలని సూచించారన్నారు.
ఇదీ చూడండి: చావునైనా భరిస్తా... ఆత్మగౌరవం కోల్పోను: ఈటల రాజేందర్