కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించింది. ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం జూన్ 10 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉ. 6 నుంచి మ. 12 వరకు సడలింపు యథాతథంగా కొనసాగనుంది.
ఇదీ చదవండి: రేపు ప్రారంభం కావల్సిన ఇంటర్ ఆన్లైన్ తరగతులు వాయిదా