ETV Bharat / city

పెరిగిన ఖర్చులు.. పెరగనున్న అప్పుల తిప్పలు.. - వ్యవసాయానికి పెరిగిన పెట్టుబడి ఖర్చులు

సాగుకు పెట్టబడి ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. గతేడాదితో పోలిస్తే అన్ని ఖర్చులు పెరిగాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్‌ రేటు పెరగడం వల్ల ట్రాక్టర్లకు కిరాయిలు పెంచుతున్నారని రైతులు వాపోతున్నారు. కరోనా వల్ల రోజు కూలీ పెరిగిందని అంటున్నారు. రైతు బంధు కూడా అందకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు.

agriculture
agriculture
author img

By

Published : Jun 16, 2020, 7:00 AM IST

పంటల సాగుకు పెట్టుబడి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. గతేడాదితో పోలిస్తే అన్ని ఖర్చులూ పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, పురుగు మందులు మొదలుకొని దుక్కులు, ఇతర పనులకు వినియోగించే వాహనాల దాకా అన్నింటికి గతేడాదికన్నా రేట్లు పెరిగాయి. ప్రస్తుతం దుక్కుల పనులు ముమ్మరంగా సాగుతుండటంతో ట్రాక్టర్లకు గిరాకీ పెరిగింది. డీజిల్‌ రేటు పెరగడం వల్ల ట్రాక్టర్లకు కిరాయిలు పెంచుతున్నారని రైతులు వాపోతున్నారు.

ఎకరానికి రూ.3 వేలు ఖర్చు అదనం

నేను ఆరెకరాల్లో పత్తి సాగు చేస్తున్నాను. గతేడాదికన్నా ఈసారి అన్ని రేట్లు పెరిగాయి. కరోనా వల్ల రోజు కూలీ పెరిగింది. ఎకరానికి కనీసం రూ.3 వేలకు తగ్గకుండా ఖర్చులు పెరిగాయి. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నాం. రైతుబంధు సొమ్ము ఇంకా రాలేదు.

- కాడె నారాయణ, పత్తి రైతు, తలమడుగు గ్రామం, ఆదిలాబాద్‌ జిల్లా

రూ.వందల కోట్ల ఆర్థిక భారం

వ్యవసాయశాఖ అధ్యయనం ప్రకారం ఎకరా వరి పొలంలో ట్రాక్టర్‌ దుక్కులకు రూ.4 వేలు ఖర్చవుతుంది. ప్రాంతాన్ని బట్టి గతేడాది కన్నా రూ.200 పెంచి.. 800 నుంచి 1000 రూపాయల దాకా తీసుకుంటున్నారు. ఎకరానికి రెండు మూడు సార్లు దుక్కులకు కలిపి అదనంగా రూ.400 చొప్పున ట్రాక్టర్‌ రేటు పెరిగింది. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాల్లో ప్రస్తుతం పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. అదనంగా రూ. వందల కోట్ల ఆర్థిక భారం రైతులపై పడింది. దీని ప్రభావంతో అన్ని రకాల పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయని ములుగు జిల్లాకు చెందిన ఓ మండల వ్యవసాయాధికారి ‘ఈనాడు’కు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఎకరానికి కనిష్ఠంగా రూ.వెయ్యి ఖర్చు పెరిగినా మొత్తం 1.25 కోట్ల ఎకరాలకు రైతులు భరించాల్సిన సొమ్ము సుమారు రూ.1200 కోట్లు అదనంగా ఉంటుందన్నారు.

పశువుల ఎరువు ధర పైపైకి

పసుపు సాగుకు పశువుల ఎరువు వాడతాం. ఎకరానికి లారీ ఎరువు ధర గతేడాది రూ.13,500 ఉంటే ఈసారి రూ.16,500 పెంచారు. ఎకరానికి 3 లారీల ఎరువు వాడటం వల్ల రూ.9 వేల భారం ఎక్కువైంది. మిగతా ఖర్చులు మరో రూ.3 వేల దాకా పెరిగాయి.

-పెద్దన్నగారి గంగారెడ్డి, బుస్సాపూర్‌, మెండోర మండలం, నిజామాబాద్‌ జిల్లా

విత్తన ధరతోనూ వెతలు

ప్రస్తుత సీజన్‌లో సన్నరకాల వరి, కంది, పత్తి విత్తనాలకు బాగా డిమాండు పెరిగింది. వరి విత్తనాల ధరను వ్యవసాయశాఖ కిలోకు రూ.29 చొప్పున లెక్కగట్టింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టీఎస్‌ సీడ్స్‌)కిలో రూ.31కి విక్రయిస్తోంది. కంది విత్తనాల ధరలను పెంచేశారు. గతేడాది వరకూ వరి, కంది, పెసర, మినుము, వేరుసెనగ వంటి పంటల విత్తనాలను రాయితీపై వ్యవసాయశాఖ విక్రయించేది. ఈ వానాకాలంలో సోయా తప్ప మిగతా వాటికీ రాయితీ రద్దు చేయడంతో వాటిని ప్రైవేటు కంపెనీలు చెప్పిన ధరకు కొనాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

కిలో సన్నరకం వరి విత్తనాలను కొన్ని కంపెనీలు రూ.35 నుంచి రూ.40 దాకా అమ్ముతున్నాయి. సోయా చిక్కుడు విత్తనాల ధరను టీఎస్‌ సీడ్స్‌ క్వింటా విక్రయ ధరను రూ.6,645గా నిర్ణయించింది. ప్రభుత్వ రాయితీ పోను రైతుకు రూ.3944కు అమ్ముతామంది. ఆ ధరలకు ఇప్పుడు విత్తనాలు దొరకడం లేదని కంపెనీలు ఈ సంస్థకు సరఫరా చేయడం లేదు. సోయా విత్తనాలను ప్రైవేటు కంపెనీలు క్వింటాను రూ.9 వేలకు అమ్ముతున్నాయి.

ఇదీ చదవండి: కరోనా టెస్టులు, చికిత్సల ధరలను ప్రకటించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.