ETV Bharat / city

సర్కారు దవాఖానాల్లో ప్రసవాలకు అదనపు ఖర్చు రూ.3,846

CSD Report 2022: సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సమయంలో అదనపు ఖర్చవుతోందని సామాజిక అభివృద్ధి మండలి గణాంకాలు విడుదల చేసింది. రాష్ట్రంలో ఆరోగ్య రంగం స్థితిగతులపై సామాజిక అభివృద్ధి మండలి(సీఎస్‌డీ) రూపొందించిన నివేదికను సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పుస్తక రూపంలో ఆవిష్కరించారు.

CSD STATISTICS
child births in telangana
author img

By

Published : Apr 5, 2022, 8:51 AM IST

CSD Report 2022: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం ఉచితమైనా ఒక్కో ప్రసవానికి 2019-20 గణాంకాల ప్రకారం అదనపు ఖర్చు సగటున రూ.3,846 ఖర్చవుతోందని సామాజిక అభివృద్ధి మండలి(సీఎస్‌డీ) స్పష్టం చేసింది. ఇది 2014-15లో రూ.4,218 కావడం గమనార్హం. అతితక్కువగా మహబూబ్‌నగర్‌లో ఒక్కో ప్రసవానికి రూ.2,369 ఖర్చు కాగా.. అత్యధికంగా మెదక్‌ జిల్లాలో రూ.6,139 వ్యయమైంది. ఖర్చు ఎక్కువైన జిల్లాల జాబితాలో మెదక్‌ తర్వాత స్థానంలో జయశంకర్‌ భూపాలపల్లిలో రూ.5,993.. కామారెడ్డిలో రూ.5,957గా నమోదైంది. రాష్ట్రంలో ఆరోగ్య రంగం స్థితిగతులపై సామాజిక అభివృద్ధి మండలి(సీఎస్‌డీ) రూపొందించిన నివేదికను సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పుస్తక రూపంలో ఆవిష్కరించారు. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-4) 2014-15కు.. (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5)2019-20కి మధ్య గణాంకాలను పోల్చుతూ నివేదికను రూపొందించారు.

  • 20-24 ఏళ్ల వయస్సుండి.. 18 ఏళ్లలోపు పెళ్లైన యువతులు 2014-15లో 26.2 శాతం మంది, 2019-20లో 23.5 శాతం మంది ఉన్నారు.
  • 15-19 ఏళ్ల వయస్సు గర్భిణులు 10.6 నుంచి 5.8 శాతానికి తగ్గారు.
  • జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో ఆరేళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న బాలికల్లో కేవలం 50%లోపే బడికి వెళ్తున్నారు. గద్వాలలో 47.8%మంది, వనపర్తిలో 49.30%మంది చిన్నారులే బడికివెళుతున్నారు.
  • రాష్ట్రంలో బడికెళ్లే అమ్మాయిల సగటు శాతం 60.9 కాగా.. అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 80.30% మంది వెళుతున్నారు. మేడ్చల్‌ జిల్లాలో 72.90%, హనుమకొండలో 70.30%మంది బడి బాట పడుతున్నారు.
  • రాష్ట్రంలో 2019-20లో మహిళా అక్షరాస్యత సగటు 66.60%గా ఉంది. 83.60%తో హైదరాబాద్‌ అగ్రస్థానంలో.. 45%తో గద్వాల జిల్లా అట్టడుగునా ఉన్నాయి.
  • నెలసరి సమయంలో పరిశుభ్రత విధానాలను పాటించే మహిళలు ఐదేళ్ల కిందట 76.5 శాతం ఉండగా.. 2019-20లో 92.1 శాతానికి పెరిగారు.
  • 15-49 ఏళ్ల మధ్యవయస్కులైన మహిళల్లో కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటిస్తున్న వారు 57.2 శాతం నుంచి 68.1 శాతానికి పెరిగారు.
  • గర్భిణి దశలో తొలి మూణ్నెళ్లలోపు పరీక్షలు పొందిన వారు 83.1 శాతం నుంచి 88.5 శాతానికి ఎగిశారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 95.5 శాతం మంది ఉన్నారు.
  • గర్భిణి దశలో నాలుగుసార్లు పరీక్షలు చేయించుకున్నవారు 74.9 శాతం నుంచి 70.4 శాతానికి తగ్గారు.
  • ప్రసవానంతరం కనీసం 2 రోజుల పాటు వైద్యసేవలు పొందినవారు 81.7 శాతం నుంచి 87.6 శాతానికి పెరిగారు. వరంగల్‌ గ్రామీణ జిల్లాలో అత్యధికంగా 93.8 శాతం మంది నమోదయ్యారు.
  • ఆసుపత్రుల్లో ప్రసవాలు 91.5 శాతం నుంచి 97 శాతానికి పెరిగింది. వరంగల్‌ గ్రామీణ జిల్లాల్లో 100 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరగడం విశేషం. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30.5 శాతం నుంచి 49.7 శాతానికి పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అతి తక్కువ ప్రసవాలు నిర్మల్‌ జిల్లాలో 31.3 శాతంగా నమోదైంది.
  • తెలంగాణలో సిజేరియన్లు 2014-15లో 57.7 శాతం కాగా.. 2019-20 కొచ్చేసరికి 60.7 శాతానికి పెరిగింది. అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాలో 82.4 శాతం కాగా.. అతి తక్కువగా కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 27.2 శాతంగా గుర్తించారు. ఇందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు ఐదేళ్ల కిందట 74.5 శాతం కాగా.. 2019-20లో 81.5 శాతానికి పెరగడం గమనార్హం. ప్రభుత్వ వైద్యంలోనూ సిజేరియన్లు ఐదేళ్లలో పెరిగాయి. 2014-15లో సర్కారు దవాఖానాల్లో కాన్పు కోతలు 40.3 శాతం కాగా.. 2019-20లో 44.5 శాతానికి పెరిగాయి.
  • సాధారణం కంటే బరువు తక్కువగా ఉన్న మహిళలు 22.9 శాతం నుంచి 18.8 శాతానికి తగ్గడం ఆహ్వానించదగిన పరిణామమే. ఇదే సమయంలో అధిక బరువు మహిళలు 28.6 శాతం నుంచి 30.1 శాతానికి పెరగడం ఆందోళన కలిగించే అంశం.
  • ఐదేళ్లలోపు చిన్నారుల్లో రక్తహీనత 60.7 శాతం నుంచి 70 శాతానికి పెరిగింది.

విద్యా రంగంలో...

  • అయిదేళ్ల పిల్లల్లో రాష్ట్రంలో సగటున 2019-20 విద్యా సంవత్సరంలో 15.30 శాతం మంది పూర్వ ప్రాథమిక విద్య అభ్యసిస్తున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 27.20 శాతం మంది, అతి తక్కువగా జయశంకర్‌ భూపాలపల్లిలో 3.90 శాతం ప్రీ ప్రైమరీ చదువుకు వెళుతున్నారు.
  • పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు చదువుతున్న మహిళలు రాష్ట్రంలో సగటున 45.50 శాతం మంది ఉన్నారు. అత్యధికంగా 63.20 శాతంతో హైదరాబాద్‌ ప్రథమ స్థానంలో ఉండగా...27.40 శాతంతో గద్వాల అట్టడుగున నిలిచింది. కుమురం భీం ఆసిఫాబాద్‌లో 28.70 శాతం, మహబూబాబాద్‌లో 34.70 శాతం మందే ఉన్నారు.

ఇదీచూడండి: Minister Harish Rao Review: 'ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.