ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమవడం వల్ల జంటనగరాల్లో జోరుగా క్రికెట్ బెట్టింగ్ సాగుతోంది. బంతి బంతికి... పరుగు పరుగుకూ పందాలు వేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ బెట్టింగ్‌లతో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. పంటర్లు, బుకీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
రెండు ముఠాలు అరెస్టు
హైదరాబాద్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తలాబ్ కట్టకు చెందిన సత్తార్, హసన్‌ను అదుపులోకి తీసుకొని... 40వేలు స్వాధీనం చేసుకున్నారు. మరోకేసులో బేగంబజార్‌కు చెందిన విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేసి 32వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఫోన్ల ద్వారానే...
గతంలో ఇతర రాష్ట్రాల వారు నగరంలో బెట్టింగ్ నిర్వహించేవాళ్లు. కానీ ప్రస్తుతం ఫోన్ల ద్వారానే బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. గతేడాది మూడు కమిషనరేట్ల పరిధిలో 58మంది నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఇవీచూడండి: బెట్టింగ్ ముఠా అరెస్ట్: రూ 2 లక్షల నగదు స్వాధీనం