భోపాల్‌లో జరిగిన చిత్ర భారతి ఫిల్మ్ ఫెస్టివల్లో హరిప్రసాద్ పసుపుల ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నాడు. లాక్డౌన్ సమయంలో వ్యర్థాల నిర్వాహణపై హరిప్రసాద్ తీసిన స్టాప్ మోషన్ షార్ట్ ఫిల్మ్ "పవర్ ఆఫ్ ఛేంజ్" పోటీలో రెండో స్థానంలో నిలిచింది. దీనికి గానూ.. 25 వేల నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్, ట్రోఫీని అందుకున్నాడు. హరిప్రసాద్ తీసిన షార్ట్ ఫిల్మ్‌ను చూసిన బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్.. ప్రోత్సాహకంగా లక్ష రూపాయలు అందించాడు. ఈ షార్ట్ ఫిల్మ్.. హైదరాబాద్‌లోని నిర్వహించిన ఎకో బబుల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకుంది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా 15 వేల నగదు బహుమతిని హరిప్రసాద్ అందుకున్నాడు.
ఏవీజీసీ శిక్షణ రంగంలో చేసిన కృషికి గానూ క్రియేటివ్ మల్టీమిడియా వ్యవస్థాపకుడు రాజశేఖర్ బుగ్గవీటి.. ఎడ్యుస్పార్క్ ప్రత్యేక గౌరవ పురస్కారానికి ఎంపికయ్యారు. యానిమేషన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఎడ్యుస్పార్క్ పురస్కారాల వేడుకలో.. రాజశేఖర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మల్టీమీడియా శిక్షణలో సుమారు 24 ఏళ్లుగా రాజశేఖర్ చేస్తున్న కృషిని.. సాధిస్తున్న విజయాలకు ఈ అవార్డు సముచితమైన గుర్తింపని పలువురు కొనియాడారు.
ఇవీ చూడండి: