ETV Bharat / city

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేశాయి' - cpm leaders fire on central govt

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ బహిరంగ సభ నిర్వహించారు. దిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో బహిరంగ సభలో పాల్గొన్న సీతారాం ఏచూరి.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు వైఖరిపై ధ్వజమెత్తారు. వైద్య వ్యవస్థ నిర్వీర్యం, ప్రభుత్వాలను కూల్చడం, దేశాన్ని హిందూ దేశంగా మార్చడమే లక్ష్యంగా కేంద్రం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు.

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేశాయి'

author img

By

Published : Aug 26, 2020, 8:28 PM IST

దేశంలోని అనేక రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ నుంచి ప్రజలను రక్షించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. సోషలిస్టు దేశాలు కరోనాను సమూలంగా నివారించాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ బహిరంగ సభ నిర్వహించారు.

దిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో బహిరంగ సభలో పాల్గొన్న సీతారాం ఏచూరి.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఒక్క మతానికి మాత్రమే కొమ్ముకాస్తుందని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని బలహీనం చేసి హిందూ దేశంగా మార్చడానికి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

పట్టణ ప్రజలకు ఉపాధి కల్పించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా.. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు డిమాండ్ చేశారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేశాయని మండిపడ్డారు.

ఇవీ చూడండి: 'మాకు సీఐడీ మీద నమ్మకం లేదు... సీబీఐ విచారణ కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.