హాథ్రస్ అత్యాచార ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ వద్ద సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో యూపీ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. యూపీలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరిసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని సీపీఎం కార్యవర్గ సభ్యులు జ్యోతి మండిపడ్డారు.
యూపీలో జరుగుతున్న హింసపై జాతీయ మహిళా కమిషన్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె ప్రశ్నించారు. మహిళలకు భద్రత కల్పించాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం రక్షణగా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. యూపీలో మహిళలకు న్యాయం జరిగే వరకు దశల వారీగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: యూపీలో మైనర్ అపహరణ, సామూహిక అత్యాచారం