ETV Bharat / city

నిబద్ధత, నిజాయతీ కలిగిన కళాకారుడిని కోల్పోయాం: చాడ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వార్తలు

జాతీయ సమితి సభ్యుడు జాకబ్ పార్థివదేహానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నివాళులర్పించారు. జాతీయ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

CPI state secretary Chada venkatareddy Condolence on jacob death
నిబద్ధత, నిజాయతీ కలిగిన కళాకారుడిని కోల్పోయాం: చాడ
author img

By

Published : Feb 7, 2021, 5:01 PM IST

ప్రజానాట్యమండలి కళాకారుడు, జాతీయ సమితి సభ్యుడు జాకబ్ మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బొల్లారంలోని జాకబ్ కూతురు నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. జాకబ్ విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగారని గుర్తు చేసుకున్నారు.

ఇటీవల జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశంలో రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. నాటికను ప్రదర్శించారన్నారు. నిబద్ధత, నిజాయతీ కలిగిన కళాకారుడిని ప్రజానాట్యమండలి కోల్పోయిందని.. అతని మృతి తీరని లోటని అన్నారు. జాకబ్ మృతికి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

కళాకారుడు సాహెబ్ జాకబ్ గుండెపోటుతో హైదరాబాద్లో​ మృతి చెందారు. ఆయన 1959లో గోదావరిఖనిలో జన్మించారు. 1977లో సింగరేణి కార్మికునిగా ఉద్యోగంలో చేరారు. విద్యార్థి దశ నుంచే అఖిల భారత విద్యార్థి సమైక్యలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

ఇదీ చూడండి: ప్రముఖ కళాకారుడు సాహెబ్ జాకబ్ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.