ఇస్రోను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... నేడు సీపీఐ తలపెట్టిన ఛలో శ్రీహరి కోట కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఏపీ సీఎం కొవిడ్-19 చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో ఎన్ని పడకలున్నాయి..? ఎన్ని ఖాళీలున్నాయి..? అని విధిగా బయట బోర్డు పెట్టి... ఆరోగ్యశ్రీ పర్యవేక్షించాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనపడకపోవడం ఆందోళకరంగా ఉందన్నారు. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతిపౌరుడి బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంగానే ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా విలయం: కోటి 21 లక్షలు దాటిన కేసులు