ETV Bharat / city

ప్రజాసమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించండి: డి.రాజా - cr foundation news

ప్రజలకు నిత్యం అండగా ఉండి.. పార్టీ పట్ల వారిలో విశ్వాసాన్ని తీసుకురావాలని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఇతర నేతలకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా సూచించారు. వ్యవసాయ చట్టాలపై గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు.

d raja met cpi state secretary
d raja met cpi state secretary
author img

By

Published : Aug 17, 2021, 8:24 PM IST

Updated : Aug 17, 2021, 8:37 PM IST

రాష్ట్రంలో ప్రజా ఉద్యమాల నిర్మాణం, ప్రజాసమస్యల పరిష్కారంలో నేతలు, కార్యకర్తలు కీలక భూమిక పోషించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సూచించారు. సామాన్యులు, కష్టజీవులకు అండగా ఉంటూ.. ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని తీసుకురావాలని కోరారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన డి.రాజా.. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూమ్‌ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డిలతో సమావేశమయ్యారు.

d raja met cpi state secretary
d raja met cpi state secretary

ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పార్టీ ఉద్యమ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించారు. వ్యవసాయ చట్టాలపై గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఆయా చట్టాలను రద్దుచేసేంతవరకూ పోరాటం చేయాలన్నారు.

పోడు భూముల సమస్యపై గిరిజనులను.. అటవీ అధికారులు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి.. డి. రాజా దృష్టికి తీసుకువచ్చారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలున్న జిల్లాల్లో పోడు యాత్రను నిర్వహించామని చెప్పారు.

సీఆర్​ ఫౌండేషన్​కు డి. రాజా దంపతులు..

సీపీఐ జాతీయ కార్యదర్శి, సీఆర్​ ఫౌండేషన్​ చీఫ్​ ప్యాట్రన్​ డి. రాజా, అతని సతీమణి (ఎన్​ఎఫ్​ఐడబ్ల్యూ జనరల్​ సెక్రటరీ) అని రాజా.. ఇవాళ మధ్యాహ్నం సీఆర్​ ఫౌండేషన్​ను సందర్శించారు. వీరికి ఫౌండేషన్​ అధ్యక్షుడు కె. నారాయణ, సీఆర్​ ఫౌండేషన్​ జనరల్​ సెక్రటరీ పల్లా వెంకట్​రెడ్డి, పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్​, చెన్నమనేని వెంకటేశ్వరరావు, డా. రజనీ, డా.పి.సరస్వతి, సోమూరి తుకారం, రాజేందర్​రావు, శ్రీనివాస్​.. స్వాగతం పలికారు. అనంతరం డి.రాజా దంపతులు.. అక్కడున్నవారితో మాట్లాడారు. వారి క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సీఆర్​ ఫౌండేషన్​ కార్యక్రమాలను అభినందించారు.

cpi national secretary D raja
సీఆర్​ ఫౌండేషన్​లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా

ఇదీచూడండి: KTR: 'నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు... కానీ నేనేమి చేశానంటే..'

Last Updated : Aug 17, 2021, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.