ETV Bharat / city

'29 నుంచి 31 వరకు సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు' - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి వార్తలు

ఈనెల 29 నుంచి 31 వరకు సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్​లో జరగనున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలు, త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలు, జాతీయ మహాసభల నిర్వహణ అంశాలపై చర్చించనునున్నట్లు ప్రకటించారు.

cpi national executive committee meetings to be held on January 29 to 31 in Hyderabad
'29 నుంచి 31 వరకు సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు'
author img

By

Published : Jan 8, 2021, 10:55 AM IST

సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈనెల 29 నుంచి 31 వరకు హైదరాబాద్​లో జరగనున్నాయి. తెలంగాణ వేదికగా జరుగనున్న ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాలను విశ్లేషించనున్నారు. త్వరలో జరగనున్న కేరళ, తమిళనాడు, పశ్చిమ బంగ, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు, పార్టీ రాష్ట్ర, జాతీయ మహాసభల నిర్వహణ అంశాలపై చర్చించనునున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు.

జాతీయ కార్యవర్గం జనవరి 29న.. జాతీయ సమితి 30, 31వ తేదీల్లో సమావేశమవుతాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ ప్రముఖులు, కార్మిక నాయకులు, కేరళ రాష్ట్ర సీపీఐ మంత్రులు హాజరవుతారని తెలిపారు.

ఇదీ చూడండి: గ్రేటర్​​ హైదరాబాద్​లో నేటి నుంచి సీరో సర్వే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.