బిగ్ బాస్ షో ప్రదర్శన వల్ల యువతకు, సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని సీపీఐ(cpi) జాతీయ కార్యదర్శి నారాయణ(cpi narayana) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు పూర్తి విరుద్ధంగా.. కేవలం సంపాదన కోసమే ఈ షో నిర్వహించడం అనైతికమన్నారు. సంస్కృతిని అమ్మేసుకుంటూ.. డబ్బు సంపాదన అవసరమా అని బిగ్ బాస్ షో నిర్వాహకులను నారాయణ ప్రశ్నించారు. ఆ షోలో ఉండే యువతి, యువకులు 24 గంటలు ఏమి చేస్తున్నారో తెలీదని.. లోపల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తనకు అనుమానంగా ఉందన్నారు.
బిగ్ బాస్ వ్యవహారంలో ఎంత ఆలోచించినా... ఈ సమాజానికి ఏమైనా సందేశం ఇస్తుందా?. యూత్‌కుగానీ, ప్రజానీకానికి గానీ పనికొచ్చే ప్రయోజనకరమైన సందేశమేమైనా ఉందా?. పైగా అనేక అనుమానాలు, అనైతిక చర్యలకు ఉపయోగపడే కేంద్రంగా మారిపోయింది. వేల కోట్ల రూపాయల టర్నోవర్ కావొచ్చు. కేంద్రప్రభుత్వాన్ని కొనగలిగే వ్యక్తి బిగ్ బాస్ అసలు ఓనరు. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంత అనైతిక పద్ధతుల్లో మన సంస్కృతిని అమ్మేసుకోవడం, మన సాహిత్యాన్ని అమ్మేసుకోవడం , నైతికతను పోగొట్టుకోవడం, ఈ పద్ధతిలో డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉందా?. దాదాపు వంద రోజుల పాటు యువతీ యువకులను తీసుకెళ్లి ఒక క్యాంపులో పెడుతున్నారు. వాళ్ల అరుపులు, కేకలను బిట్లుగా ప్రదర్శిస్తున్నారు. కానీ 24 గంటలు వాళ్లు ఏం చేస్తారో తెలియదు. అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని నాకు అనుమానంగా ఉంది. లేదంటే 24 గంటల లైవ్ పెట్టాలి. అటువంటి కార్యక్రమాలకు నాగార్జున సహకరించడం మంచి పద్ధతి కాదు.
-నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
ఇదీ చదవండి: Jagan Bail case: జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరణ.. రఘురామ పిటిషన్ కొట్టివేత