cpi narayana wife death: సీపీఐ నేత నారాయణ సతీమణి వసుమతిదేవి(65) ఇవాళ కన్నుమూశారు. అనారోగ్యంతో ఏపీ తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొద్ది రోజుల క్రితమే ఆస్పత్రిలో చేరారు. రేపు నగరి మండలం ఐనంబాకంలో వసుమతి దేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సీఎం కేసీఆర్ సంతాపం: సీపీఐ నేత నారాయణ సతీమణి వసుమతిదేవి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నారాయణ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా మంత్రులు తలసాని, సత్యవతి రాఠోడ్, బోయినపల్లి వినోద్‌కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సంతాపం ప్రకటించారు.
స్పీకర్, మండలి ఛైర్మన్ సంతాపం: నారాయణ సతీమణి మృతిపట్ల స్పీకర్ పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ సంతాపం ప్రకటించారు. సీపీఐ నేత నారాయణ సతీమణి మృతిపట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: Ambedkar Jayanthi Celebrations: 'రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు'