ETV Bharat / city

CHADA: 'నరేంద్ర మోదీ హయాంలో టాక్స్​లేని వస్తువే లేదు'

హైదరాబాద్ బషీర్​బాగ్​లోని జీఎస్టీ భవన్ ముందు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి ధర్నా నిర్వహించారు. కరోనా ఔషధాలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్​ చేశారు. కరోనా మందులపై ట్యాక్స్​ వేయటమంటే శవాల మీద పన్ను వేసినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

cpi leader chada venkat reddy protest against tax on corona medicines

author img

By

Published : Jun 8, 2021, 1:26 PM IST

కరోనాను ఎదుర్కొవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి ఆరోపించారు. కరోనా ఔషధాలపై జీఎస్టీని ఎత్తివేయాలంటూ... సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్​బాగ్​లోని జీఎస్టీ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి ట్యాక్స్​ వేయడంపై ఉన్న శ్రద్ధ... ప్రజల ఆరోగ్యంపై లేదని చాడ విమర్శించారు.

పేదలకు సహాయం చేయాల్సింది పోయి... పన్నుల రూపంలో భారం వేస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ రాజ్యంలో ట్యాక్స్​ లేని వస్తువే లేదని... కరోనా ఔషధాలపై పన్ను​ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. కరోనా మందులపై ట్యాక్స్​ వేయటమంటే శవాల మీద పన్ను వేసినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒత్తిడితో మోదీ ఉచిత వ్యాక్సిన్ ప్రకటించారని తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనకు ఉచిత వైద్యం అందించడంతో పాటు... రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని చాడ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: నేడు కేబినెట్​ భేటీ.. లాక్​డౌన్​ పొడిగింపుపై క్లారిటీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.