ETV Bharat / city

'రాష్ట్రానికి కేంద్రం సహకరించి రైతులను ఆదుకోవాలి' - chada fire on kishanreddy

రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తూ... రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి సూచించారు. వరి ధాన్యానికి బోనస్​ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడగా... కేంద్రం అడ్డుకోవటం సరికాదన్నారు. సాదాబైనామాల కోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకురావడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు.

'రాష్ట్రానికి కేంద్రం సహకరించి రైతులను ఆదుకోవాలి'

author img

By

Published : Nov 15, 2020, 3:52 PM IST

రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యానికి బోనస్ ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు కేంద్రం మోకాలొడ్డటం రాజకీయమే అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తూ... రైతులను ఆదుకోవడానికి సన్నాలకు రూ. 2500 చెల్లించాలని చాడా డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న రైతుతో ఆడుకోవడం విజ్ఞత కాదని హితవు పలికారు. సాగు నియంత్రణలో భాగంగా సన్నరకాల వరి పంటను సాగు చేయాలన్న సీఎం కేసీఆర్... ఈ విషయంలో తప్పించుకోలేరని హెచ్చరించారు.

ప్రత్యేక ఆర్డినెన్స్​ మంచి పరిణామం...

హైకోర్టు ఆదేశాలతో సాదాబైనామాల కోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకురావడం మంచి పరిణామమన్నారు. ఈ నిర్ణయం... నిరుపేద, సన్న, చిన్నకారు రైతులకు ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. గడువు ముగిసేలోపు 9 లక్షల వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు వచ్చాయంటే.. రెవెన్యూ రికార్డుల వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతుందన్నారు. రెవెన్యూ రికార్డులు సరి చేయటంతో పాటు డిజిటల్ సర్వేకు తేదీ నిర్ణయించి... సమాంతరంగా సర్వే, రికార్డులను సరిచేయాలని ప్రభుత్వానికి చాడా సూచించారు.

కిషన్​రెడ్డి ప్రకటన శోచనీయం...

రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్​ ట్యాపింగ్ చేస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్​రెడ్డి ప్రకటించడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా పేర్కొన్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పరిస్థితికి దిగజారితే... రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడానికి కేంద్రానికి అధికారం లేదా అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.