ETV Bharat / city

CP Anjani kumar: 'ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తే ఇద్దరూ హెల్మెట్​ ధరించాల్సిందే' - cp anjani kumar on bonalu

వర్షాకాలం వేళ ద్విచక్రవాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్​ చేయలాని సీపీ అంజనీకుమార్​ సూచించారు. వాహనంపై ఇద్దరుంటే ఇద్దరూ హెల్మెట్​ ధరించాలని సూచించారు. త్వరలో నిర్వహించనున్న బోనాల వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు తమకు సహకరించాలని సీపీ కోరారు.

cp anjani kumar about bonalu in hyderabad

author img

By

Published : Jun 29, 2021, 3:43 PM IST

పేలుడు కోసులో విచారణ...

బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్​లో జరిగిన పేలుడు వ్యవహారంలో విచారణ కొనసాగుతున్నట్టు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. పేలుడుకు సంబంధించిన మూలాలు హైదరాబాద్‌లో ఉన్నట్టు ఎన్‌ఐఏ గుర్తించిన నేపథ్యంలో సీపీ స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు నగర పోలీసులు సమన్వయంతో దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని అంజనీకుమార్‌ వివరించారు.

నిషేధిత సరుకు కట్టడికి...

మరోవైపు నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపడుతున్నట్టు అంజనీకుమార్‌ తెలిపారు. నకిలీ విత్తనాలు, గంజాయి, ఇతర మత్తు పదార్ధాలను అరికట్టే విషయంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాల్సిన అవసరం ఉందని సీపీ అభిప్రాయపడ్డారు. నిషేధిత వస్తువుల అమ్మకాలను అరికట్టేందుకు ఇప్పటికే వ్యాపారులతో సమావేశం నిర్వహించామన్నారు. నిషేధిత సరుకు సరఫరా కానీ.. నిల్వ ఉంచటం కానీ చేయమని పాన్​షాప్​ల యజమానులు, వేర్​హౌస్​ యాజమాన్యాలు హామీ ఇచ్చినట్టు తెలిపారు. అక్రమార్కుల గురించి తెలిసిన వాళ్లు పోలీసులకు సమాచారం అందించాలని సీపీ కోరారు.

అనారోగ్యంగా ఉంటే బోనాలకు వద్దు

బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సీపీ వివరించారు. గోల్కొండతో పాటు సికింద్రాబాద్‌ మహంకాళి, సింహవాహిని లాల్‌దర్వాజ బోనాల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నవారు దర్శనానికి రాకుండా ఉండడమే ఉత్తమమని సూచించారు. గతంలో గోల్కొండ బోనాల సమయంలో అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చిన విషయాన్ని సీపీ గుర్తుచేశారు. ఉత్సవాలు శాంతియుతంగా జరిపేందుకు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని అంజనీకుమార్‌ కోరారు.

ఇద్దరు ధరించాల్సిందే..

వర్షాకాలంలో రోడ్లపై రాకపోకలు సాగించే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోండి. ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తే ఇద్దరూ శిరస్త్రాణం ధరించాల్సిందే. దంపతులిద్దరు ప్రయాణించేటప్పుడు భర్తకు మాత్రమే హెల్మెట్​ ఉంటోందని... భార్యకు లేకపోవటాన్ని చాలా వరకు గుర్తించాం. ఇకపై వాహనంపై ప్రయాణించే ఇద్దరు శిరస్త్రాణాలు ధరించాల్సిందే. - సీపీ అంజనీ కుమార్

'ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తే ఇద్దరూ హెల్మెట్​ ధరించాలి'

ఇదీ చూడండి: తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.