ETV Bharat / city

డ్రగ్స్‌ కేసులో నలుగురు అరెస్ట్.. సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు - డ్రగ్స్​ కేసులో గల్లా అశోక్​

CP Anand holds emergency meeting with police officials on drugs case

author img

By

Published : Apr 3, 2022, 4:07 PM IST

Updated : Apr 3, 2022, 7:44 PM IST

16:04 April 03

డ్రగ్స్ కేసుపై పోలీసు అధికారులతో సీపీ ఆనంద్‌ అత్యవసర భేటీ

Hyderabad Drugs Case: హైదరాబాద్​లో బంజారాహిల్స్‌ రాడిసన్‌ హోటల్‌లోని పుడింగ్‌ అండ్‌ మింట్‌ పబ్‌లో బయటపడిన డ్రగ్స్‌ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. పబ్ నిర్వాహకుడు అభిషేక్, ఈవెంట్ మేనేజర్ అనిల్, వీఐపీ మూమెంట్ చూసే కునాల్‌, డీజే ఆపరేటర్ వంశీధర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం వారిని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటింటారు.

పోలీసుల సీరియస్​ ఫోకస్​...: ఈ డ్రగ్స్ కేసుపై పోలీసు అధికారులతో సీపీ ఆనంద్‌ అత్యవసరంగా భేటీ అయ్యారు. పలువురు పోలీసుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీవీ ఆనంద్.. వెస్ట్‌జోన్‌లోని ఆయా పీఎస్‌ల ఎస్సైలు, డిటెక్టివ్ సీఐలు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే.. పబ్‌లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను పోలీసులు ల్యాబ్‌కు పంపించారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక కోసం డ్రగ్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిమగ్నమయ్యారు. వెస్ట్‌జోన్, బంజారాహిల్స్‌, నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఎవరెవరు డ్రగ్స్​ సేవించారు..?: పక్కా సమాచారంతో నిన్న(మార్చి2) అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్‌పై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొకైన్​, గంజాయి, ఎల్ఎస్​డీని పోలీసులు గుర్తించారు. అధికారులు అక్కడికి చేరుకోగానే పలువురు.. మత్తుపదార్థాలను విసిరేసినట్లు తెలుస్తోంది. పబ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు... యజమాని సహా 144 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సినీనటి నిహారిక, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ కూడా ఉన్నారు. నిహారికకు పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు. అదుపులోకి తీసుకున్నవారందనీ విచారించిన పోలీసులు... వారి వివరాలు సేకరించి వదిలేశారు. అయితే.. పబ్‌లోకి డ్రగ్స్ ఎలా చేరాయి..? ఎవరెవరు వినియోగించారు..? అన్న అంశాలపై పోలీసులు దృష్టిసారించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత కథనాలు..

Last Updated : Apr 3, 2022, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.