ETV Bharat / city

'కొవిడ్ కాలంలో ఆదుకున్న వారి సేవలు చిరస్మరణీయం'

అమన్ వేదిక అధ్వర్యంలో సీతాఫల్​మండిలో ‘కొవిడ్ వారియర్ల సత్కార’ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్.. ఆయా రంగాల్లో సేవలందించిన వారిని సత్కరించడంతో పాటు జ్ఞాపికలను, ప్రశంసాపత్రాలను అందించారు.

covid warriors felicitation event at sitaphalmandi
'కొవిడ్ కాలంలో ఆదుకున్న వారి సేవలు చిరస్మరణీయం'
author img

By

Published : Dec 29, 2020, 7:31 PM IST

కొవిడ్ కష్ట కాలంలో ధైర్యంగా సేవలు అందించిన వివిధ వర్గాల వారిని సమాజం గుర్తించాలని.. వారి సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్​కు చెందిన అమన్ వేదిక అధ్వర్యంలో సీతాఫల్​మండిలోని ఫంక్షన్ హాల్లో ‘కొవిడ్ వారియర్ల సత్కార’ కార్యక్రమం జరిగింది. పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కొవిడ్ వారియర్ల సేవలను ఉప సభాపతి అభినందించారు. వైద్య, మున్సిపల్, పోలీసు, సామాజిక సేవా తదితర రంగాల వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆయా రంగాల వారిని సత్కరించడంతో పాటు జ్ఞాపికలను, ప్రశంసాపత్రాలను అందించారు. కార్పొరేటర్ సామల హేమ, ఆమన్ వేదిక ప్రతినిధులు ఇందిర, ఎల్లన్న, బూస సుమలత, నమ్రత, ఆశ, రవూఫ్, రాము తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.