ETV Bharat / city

శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు - covid 19 in telangana

రాష్ట్రంలో కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. మూడు వారాల్లోనే మూడింతలకుపైగా పాజిటివ్‌ కేసుల నమోదవడం... మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లాల్లో కొవిడ్‌ ఉద్ధృతంగా వ్యాపించడం ఆందోళనను మరింత పెంచింది. వైరస్‌ ఎవరి నుంచి సోకుతుందో తెలియని స్థితి నెలకొందని వైద్య వర్గాలు వెల్లడించాయి

శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌..  మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

author img

By

Published : Jul 26, 2020, 5:33 AM IST

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చింది. క్రమంగా జిల్లాలకు పాకిన మహమ్మారి అక్కడ వేగంగా ప్రబలుతుండడం ఆందోళన పెంచుతోంది. వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట జిల్లాల్లో భారీగా కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో వైరస్‌ నుంచి ఎవరి నుంచి ఎవరికి వ్యాప్తి చెందుతుందో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఎక్కడికక్కడ కరోనా కట్టడి చేసే దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.

మూడు వారాల వ్యవధిలోనే 50 వేలు..

తెలంగాణలో తొలి కరోనా కేసు మార్చి 2న నమోదుకాగా..... ఏప్రిల్‌ 30 నాటికి కేసులు వెయ్యి దాటాయి. తర్వాత నెల వ్యవధిలో రెట్టింపయ్యాయి. జూన్‌ 1 నుంచి కోవిడ్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. జూన్‌ 30 నాటికి 16,339గా ఉన్న బాధితుల సంఖ్య... మూడు వారాల వ్యవధిలోనే 50 వేలు దాటింది. తెలంగాణలో కరోనా మరణాలు కూడా 447కు పెరిగాయి. మార్చి 29న తొలి మరణం నమోదవ్వగా.. జూన్‌లో 140 మంది, జులైలో ఇప్పటివరకూ 187 మంది మరణించారు.

జిల్లాల్లో కొవిడ్‌ వేగంగా వ్యాప్తి..

ఇటు హైదరాబాద్‌లో వారం రోజులుగా కరోనా కేసులు తగ్గడం కొంత ఊరట కలిగిస్తున్నా.. జిల్లాల్లో వైరస్‌ బాధితులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్​ మినహా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో రోజూ వందకు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో ఉన్నవారు సొంతూళ్లకు వెళ్లిన నేపథ్యంలో వారి ద్వారా జిల్లాల్లో కోవిడ్‌ వేగంగా వ్యాప్తి చెంది ఉండవచ్చని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.

85 శాతం మందిలో..

వైరస్‌ సోకిన వారిలో 85 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని.. అలాంటి వారి వల్లే కరోనా వ్యాప్తి చెందుతోందని అధికారులు తెలిపారు. అవగాహన లేమీ, మాస్కు ధరించక పోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని... అధికారులు ఓ అంచనాకు వచ్చారు. పరిస్థితి ఇలాగే కొన్ని సాగితే కొన్ని వారాల్లోనే అన్ని జిల్లాల్లో వందల సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.