రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం మొదటి ప్రాధాన్యతగా ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందితో కూడిన డేటా బేస్ తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. సీఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ మొదటి సమావేశం సచివాలయంలో జరిగింది. కొవిడ్ వ్యాక్సినేషన్ సన్నద్ధతపై జరిగిన సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, యూనిసెఫ్, యూఎన్డీపీ, డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులు పాల్గొన్నారు.
కొవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి కోల్డ్ చైన్ సౌకర్యాలు, రవాణా, వైద్య సిబ్బందికి శిక్షణ, లాజిస్టికల్ ఏర్పాట్లు, ప్రచారం, వైద్య సౌకర్యాల మ్యాపింగ్ తదితర అంశాలపై సమీక్షించారు. కొవిడ్ తొలిదశ వ్యాక్సినేషన్ కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్న సీఎస్... వ్యాక్సినేషన్ సెంటర్ల నిర్వహణకు అవసరమైన ప్రోటోకాల్ తయారు చేయాలని తెలిపారు.