ETV Bharat / city

రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా.. - కొవిడ్​ తెలంగాణ

రాష్ట్రంలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. శుక్రవారం కొత్తగా 1640 కేసుల నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 52,466కు చేరింది. మరో 8 మంది మృతి చెందగా... మరణాల సంఖ్య 455కి చేరింది. కరోనా బాధితుల్లో... 76.8 శాతం మేర కోలుకున్నట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. వారిలో 30 శాతానికిపైగా ఇంట్లోనే చికిత్స పొందినట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

author img

By

Published : Jul 25, 2020, 5:42 AM IST

కరోనా ఉద్ధృతి రాష్ట్రంలో కొనసాగుతోంది. జిల్లాల్లోనూ కోవిడ్‌ వ్యాప్తి పెరుగుతుండడం ఆందోళనను మరింత తీవ్రం చేసింది. శుక్రవారం 15,445 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా...అందులో 1640మంది మహమ్మారి బారినపడినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కేసుల నమోదుతో.. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 52,466కు పెరిగింది. తాజాగా 1,007 మంది మహమ్మారి నుంచి కోలుకోగా... వైరస్‌ బారి నుంచి బయటవారి సంఖ్య 39,327కి చేరింది.

76.8 శాతం మంది ..

మొత్తం కరోనా కేసుల్లో 76.8 శాతం మంది కోలుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరో 8 మంది మృతి చెందగా... ఇప్పటి వరకూ 455 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుత కేసులతో పోలిస్తే మరణాలరేటు ఒక శాతంకంటే తక్కువగా ఉందని వైద్యారోగ్యశాఖ వివరించింది. ప్రస్తుతం 11,675 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గ్రేటర్​లోనే అధికం..

గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా.. 30 జిల్లాల్లో కొవిడ్‌ కేసులు బయటపడగా బల్దీయా పరిధిలోనే అత్యధికంగా 683 మందికి వైరస్‌ సోకింది. రంగారెడ్డి జిల్లాలో 135, సంగారెడ్డిలో 102, కరీంనగర్‌లో 100, పెద్దపల్లిలో 98, కామారెడ్డిలో 56 కొత్త కేసులు వెలుగు చూశాయి. నాగర్‌కర్నూల్‌లో 52, మహబూబాబాద్‌లో 44, నల్గొండలో 42, వరంగల్‌ అర్బన్‌లో 36 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 30 మంది, జయశంకర్‌ భూపాలపల్లిలో 24 మంది, మెదక్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో 22మంది చొప్పున మహమ్మారి బారిన పడ్డారు.

రాజన్న సిరిసిల్లలో 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వనపర్తి, నిజామాబాద్‌ల్లో 18 చొప్పున కేసులు నమోదవ్వగా.. జగిత్యాలలో 17, ములుగులో 14, ఖమ్మంలో 13, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట్‌, భద్రాద్రి, యాదాద్రి జిల్లాలో 11 మందికి వైరస్‌ సోకింది. జనగాం జిల్లాలో 10 మంది మహమ్మారి బారినపడగా.. ఆదిలాబాద్‌లో 9, సిద్ధిపేట, వికారాబాద్‌ల్లో 8, గద్వాల్‌, మంచిర్యాల్‌ జిల్లాలో 7, నిర్మల్‌లో ఒకరు కరోనా బారినపడ్డారు.

లక్షణాలు ఉన్నా..

కొవిడ్ లక్షణాలు ఉన్నవారు గాంధీ ఆస్పత్రికి తరలించాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. లక్షణాలు ఉన్నా.. పాజిటివ్‌గా నిర్ధారణ కానీ వారు జిల్లా ఆస్పత్రులు, కింగ్ కోఠి, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులను సంప్రదించాలని కోరింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.