ETV Bharat / city

రాష్ట్రంలో కొవిడ్​ ఉద్ధృతి.. రెండో దశపై తప్పిన అంచనాలు! - covid cases raises in Telangana

రాష్ట్రంలో కొవిడ్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. నాలుగు వారాల వ్యవధిలోనే నాలుగింతలకు పైగా కేసులు నమోదవడం ఉద్ధృతికి అద్దం పడుతోంది. మహమ్మారి వల్ల ప్రమాదకర స్థితికి చేరుకుంటున్న వారి శాతం తక్కువగా ఉన్నా.. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పడకలూ లభించకపోవడం కేసుల పెరుగుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.

covid second wave in Telangana
తెలంగాణలో శరవేగంగా కరోనా వ్యాప్తి
author img

By

Published : Apr 1, 2021, 5:26 AM IST

రాష్ట్రంలో కొవిడ్‌ రెండోదశ కలకలం రేపుతోంది. గతేడాది ఏప్రిల్‌, మే, జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈసారీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందా? అనే ఆందోళన వైద్యారోగ్య శాఖలో వ్యక్తమవుతోంది. తగిన జాగ్రత్తలు పాటించకపోతే... వచ్చే రెండు నెలల్లో... ఇప్పుడు వస్తున్న కేసుల కంటే రెట్టింపు నమోదయ్యే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అంచనాలు తారుమారు..

రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ విజృంభించిన కొవిడ్‌.... ఆ తర్వాత నెమ్మదిస్తూ వచ్చింది. సెప్టెంబరు 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో కేసులు విజృంభిస్తున్నా రాష్ట్రంలో కేసులు పెరగకపోవడం ఊరటనిచ్చింది. రాష్ట్రంలో రెండోదశ ఉద్ధృతి రాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ అంచనాలను తారుమారు చేస్తూ... మార్చి నుంచి క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

క్రమేణా పెరుగుతున్న కేసులు..

మార్చి 1న 163 కేసులు నమోదవగా... 30 రోజుల్లో నాలుగు రెట్లకు పైగా పెరిగింది. మార్చి 30 న 684 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసులు 3,07,889కి చేరాయి. గతంలోలా జీహెచ్​ఎంసీలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. గత 4 వారాల్లో 64 మంది చనిపోయారు. చికిత్స పొందుతున్నవారి సంఖ్య మార్చి 1న 19 వందల 7 ఉండగా... మార్చి 30 నాటికి బాధితుల సంఖ్య 4,965కు పెరిగింది. గత 30 రోజుల్లో వైరస్‌ క్రమేణా పెరుగుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

భయమే ప్రధాన కారణం!

గాంధీ ఆసుపత్రిలో వెయ్యి ఆక్సిజన్‌ పడకలుండగా... ప్రస్తుతం 18 మంది మాత్రమే ఉన్నారు. 500 వెంటిలేటర్‌ ఐసీయూ పడకలుండగా.... 88 మంది చికిత్స పొందుతున్నారు. అయితే కేవలం పరిస్థితి విషమించిన వారినే ఇక్కడికి తరలిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ వైద్యంలో 8,477 పడకలుండగా.. 864 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. 85 శాతానికి పైగా పడకలు నిండిపోయాయి. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేరికలకు బాధితుల్లో నెలకొన్న భయమే ప్రధాన కారణమని... అత్యధికుల్లో ప్రమాదకర లక్షణాలు లేకున్నా ముందస్తుగా చేరుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇతర సమస్యలు ఏర్పడినా.... ఆసుపత్రిలో స్పెషాలిటీ వైద్యసేవలు పొందవచ్చనే భావనతో చేరుతున్నారని వారు భావిస్తున్నారు. అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. ఏమాత్రం అనుమానం ఉన్నా.... పరీక్షలు చేయుంచుకోవాలన్నారు.

వారికి పరీక్షలు తప్పనిసరి..

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ చికిత్సల కోసం వచ్చే రోగులకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు కచ్చితంగా చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను అనుసరించి అన్ని ఆసుపత్రులు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఏ రోజుకారోజు ప్రభుత్వానికి సమాచారం పంపించాలని స్పష్టం చేశారు.

ఇవీచూడండి: నేటి నుంచి 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్ వ్యాక్సిన్: డీహెచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.