సీబీఐ, ఈడీ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఇవాళ్టి హాజరు నుంచి ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి మినహాయింపు లభించింది. సీఎంగా జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాదులు మినహాయింపు కోరారు. కోర్టు అనుమతిచ్చింది.
ఈ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 28కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: భవననిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతివ్వాలి: కేటీఆర్