రాష్ట్రంలో కరోనా రెండో దశ తగ్గుముఖం పట్టినా.. మూడో వేవ్ వస్తుందేమోనన్న భయం ప్రజలను వెంటాడుతోంది. మొదటి దశలో.. కొవిడ్ నిబంధనలు ఎక్కువగా పట్టించుకోని వారు.. రెండో దశ తీవ్రతను చూసి ఆందోళన చెందారు. మొదట కరోనా వ్యాక్సినేషన్(corona vaccination)పై అపోహలున్నా.. రెండో దశ సృష్టించిన విలయతాండవాన్ని చూసి.. బెదిరిపోయి.. టీకా(corona vaccination) తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
- ఇదీ చదవండి : Covid Vaccine: దేశంలో 39 కోట్ల టీకా డోసుల పంపిణీ
టీకాపై ఆసక్తి..
అలా.. రాష్ట్రంలో ఎక్కువ శాతం ప్రజలు కరోనా టీకా(corona vaccination) వేసుకునేందుకు ఆసక్తి చూపించారు. 18 ఏళ్లు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ పంపిణీ చేయడంతో టీకా తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు రెట్టింపవుతోంది.
24 గంటలు.. 2 లక్షల మందికి టీకా..
గడిచిన 24 గంటల్లో 2 లక్షల మందికి పైగా టీకా(corona vaccination) తీసుకున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా 1,36,232 మందికి తొలిడోస్, 79,933 మందికి రెండో డోస్ టీకా అందించినట్లు తెలిపింది. ఒకే రోజులో మొత్తం 2,16,165 మంది టీకా వేసుకున్నట్లు ప్రకటించింది.
- ఇదీ చదవండి : Viral Video: సినిమా హాల్‌ను తలపించిన టీకా కేంద్రం
ఇప్పటివరకు.. 1,07,61,636 మందికి టీకాలు
ఇప్పటి వరకు రాష్ట్రంలో.. మొత్తం 1,07,61,636 మందికి టీకాలు అందించగా.. అందులో కేవలం 21,99,854 మందికి మాత్రమే రెండో డోస్ టీకాలు అందించటం గమనార్హం. ఇచ్చిన టీకాల్లో ప్రభుత్వం పరిధిలో 1,04,55,298, ప్రైవేటులో 25,06,192 డోసులు పంపిణీ చేశారు. మొత్తం ఇప్పటి వరకు 1,29,61,490 డోసుల టీకాలు పంపిణీ చేయటం చేసినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో రెండో డోస్ టీకాలు దొరక్క అనేక మంది ఇబ్బందులు పడుతుండటం గమనార్హం.
- ఇదీ చదవండి : Vaccination: కరోనా టీకా తీసుకున్నవారికే రేషన్!