ETV Bharat / city

super spreaders: పౌరసరఫరాల శాఖలో వ్యాక్సినేషన్​ డ్రైవ్​ - telangana latest news

రేషన్​ డీలర్లు, చమురు సంస్థల సిబ్బందిని సూపర్​ స్రైడర్లుగా గుర్తించిన ప్రభుత్వం ఈనెల 28 నుంచి 31 వరకు వారికి ప్రత్యేక వాక్సినేషన్​ డ్రైవ్​ చేపట్టనుంది. టీకా తీసుకోదలచిన వారు ఇవాళ్టిలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

vaccination drive for ration dealers
పౌరసరఫరాల శాఖలో వ్యాక్సినేషన్​ డ్రైవ్​
author img

By

Published : May 26, 2021, 7:48 PM IST

రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖలో ప్రత్యేక టీకా కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 28 నుంచి 31 వరకు ప్రజాపంపిణీ వ్యవస్థలో పనిచేస్తున్న చౌకధరల దుకాణాల డీలర్లు, చమురు పరిశ్రమ సిబ్బందికి టీకాలు వేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులపాటు చేపట్టనున్న వ్యాక్సినేషన్‌ కోసం జిల్లా స్థాయిలో 200 నుంచి 250 కేంద్రాలను ఏర్పాటుచేయనుంది.

జిల్లా చౌక ధరల దుకాణాల అసోసియేషన్, ఆయిల్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రతినిధుల సమన్వయంతో అందరికీ మొదటి డోస్ టీకా ఇవ్వనున్నారు. టీకా తీసుకోవాలనుకున్న రేషన్ డీలర్లు, ఆయిల్ పరిశ్రమ సిబ్బంది.. ఇవాళ్టిలోగా సంబంధిత అధికారులకు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్​ అనీల్‌కుమార్ పేర్కొన్నారు.

కొవిడ్ రెండో దశలో ఇప్పటి వరకు సుమారు 100 మంది రేషన్​ డీలర్లు మృతిచెందారు. పెట్రోలు, డీజిల్ బంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా మరణించారు. ఎల్‌పీజీ వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే సిబ్బందిలో పలువురికి కరోనా సోకింది. తమను ఫ్రంట్​ లైన్​ వారియర్లుగా వాక్సినేషన్​ చేయాలని.. లేకుండా విధులు నిర్వహించలేమంటూ వారంతా ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించారు. ఓ దశలో ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీచేశారు.

ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం.. రేషన్​ డీలర్లు, చమురు సంస్థల సిబ్బందిని సూపర్​ స్ప్రెడర్లుగా గుర్తించింది. సర్కారు నిర్ణయంపై పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీచూడండి: ప్రతి 10మందిలో నలుగురికి పరీక్షలు చేస్తున్నాం: డీహెచ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.