ETV Bharat / city

రాష్ట్రంలో రెండు లక్షలు దాటిన కరోనా పరీక్షలు.. 39,342కు చేరిన బాధితులు - తెలంగాణ కొవిడ్​ తాజా వార్తలు

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం 1,597 కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 39,342కు పెరిగింది. మరో 11 మంది మృత్యువాత పడ్డారు. మరణించిన వారి సంఖ్య 386కు చేరింది. మరో 1,159 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 25,999కి చేరువైంది. రాష్ట్రంలో కొవిడ్‌ పరీక్షల సంఖ్య 2 లక్షలు దాటింది.

telangana corona
రాష్ట్రంలో రెండు లక్షలు దాటిన కరోనా పరీక్షలు.. 39,342కు చేరిన బాధితులు
author img

By

Published : Jul 16, 2020, 4:44 AM IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు ఉద్ధృతమవుతున్నాయి. కొత్తగా 1,597 మందికి వైరస్‌ సోకినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా బాధితుల సంఖ్య 39,342కు చేరింది. జీహెచ్​ఎంసీ పరిధిలోనే 796 కేసులు నమోదయ్యాయి.

రంగారెడ్డి 212, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 115 కేసులు బయటపడ్డాయి. సంగారెడ్డిలో 73, నల్గొండలో 58 మంది వైరస్‌ బారిన పడ్డారు. వరంగల్‌ పట్టణ 44, కరీంనగర్ జిల్లాలో 41 మందికి.. కొవిడ్‌ సోకింది. కామారెడ్డి 30, సిద్దిపేట జిల్లాలో 27 కేసులు వెలుగుచూశాయి. మంచిర్యాల జిల్లాలో 26, మహబూబ్‌నగర్ జిల్లాలో 21 మందికి కరోనా సోకింది. పెద్దపల్లి 20, మెదక్‌ 18, భూపాలపల్లి 15, సూర్యాపేటలో 14 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో 13 చొప్పున కేసులు నమోదయ్యాయి. జనగామ 8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లో ఆరుగురు చొప్పున కరోనా బారిన పడ్డారు. నారాయణపేట, వికారాబాద్, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూబాబాద్ జిల్లాల్లో... ఐదుగురు చొప్పున వైరస్‌ బారినపడ్డారు. ములుగు, గద్వాల జిల్లాల్లో... నాలుగేసి కేసులు వెలుగుచూశాయి. ఆదిలాబాద్‌లో ఒకరికి కరోనా వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

బుధవారం మరో 1,159 మంది కోలుకున్నారు. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 25, 999కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,958 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా మరో 11 మంది మరణించారు. మృతుల సంఖ్య 386కి చేరింది. బుధవారం 13,642 మందికి పరీక్షలు నిర్వహించగా... రాష్ట్రంలో ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించిన వారి సంఖ్య... 2 లక్షల 8 వేల 666కు పెరిగింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.