ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72.49 శాతం

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 1,897 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 84,544కి చేరగా... మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 654 మంది ప్రాణాలు కోల్పోయారు.

ts corona
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72.49 శాతం
author img

By

Published : Aug 12, 2020, 10:06 PM IST

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 వరకు..22 వేల 972 నమునాలను పరీక్షించారు. 18 వందల 97 మందికి కరోనా సోకినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 84వేల 544కి చేరింది. వైరస్‌ ధాటికి తాజాగా మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 654కి చేరింది.

ఇప్పటి వరకు 6,65,847 కరోనా నిర్ధారణ పరీక్షలు

వైరస్‌ నుంచి కోలుకుని ఒక్కరోజే 19 వందల 20 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 61వేల 294 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22వేల 596 యాక్టివ్‌ కేసులున్నాయి. 15 వేల 534 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6లక్షల 65వేల 847 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇంకా 1221 నమునాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సిఉందని వైద్యశాఖ అధికారులు తెలిపారు.

జిల్లాల్లో పరిస్థితి..

హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ కరోనా తీవ్రత కొనసాగుతోంది. తాజాగా జీహెచ్​ఎంసీ పరిధిలో 479 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 172, రంగారెడ్డి 162, వికారాబాద్‌ జిల్లాలో 18 కేసులు కొత్తగా వెలుగు చూశాయి. మెదక్‌ జిల్లాలో 26, సంగారెడ్డి 107, సిద్దిపేట జిల్లాలో 62 కేసులు నమోదయ్యాయి. వరంగల్‌ అర్బన్​ జిల్లాలో 87, గ్రామీణ జిల్లాలో 24, జనగామ 26, మహబూబాబాద్‌ 14, ములుగు 10, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 16 మంది వైరస్‌ బారినపడ్డారు.

ఖమ్మం జిల్లాలో 63, భద్రాద్రి కొత్తగూడెంలో 44 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లాలో 64, పెద్దపల్లి 62, జగిత్యాల 28, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 43 మందికి వైరస్‌ సోకింది. నిజామాబాద్‌ జిల్లాలో 23 , కామారెడ్డిలో 48 మందికి కొవిడ్‌ నిర్ధారణయింది. నల్గొండ జిల్లాలో 54, సూర్యాపేట 36, యాదాద్రి భువనగిరి జిల్లాలో 11 మందికి కరోనా సోకింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 41, వనపర్తి 26, నాగర్‌కర్నూల్‌ 16, నారాయణపేట 12, జోగులాంబ గద్వాల జిల్లాలో 38 మందికి కరోనా సోకింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో 21 మంది చొప్పున, మంచిర్యాలలో 38, కుమురం భీం అసిఫాబాద్‌లో 5 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా రికవరీ రేటు 69.79 శాతం ఉండగా...రాష్ట్రంలో 72.49 ఉందని వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల శాతం 1.99 శాతం ఉండగా... రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.77 శాతం శాతంగా నమోదైందని పేర్కొంది.

ఇవీచూడండి: తెలంగాణలో మరో 1,897 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.