ETV Bharat / city

కరోనా చెరలో ఏపీలోని పల్లెలు.. పట్టణాల కంటే అక్కడే ఎక్కువ కేసులు - ఏపీలో కరోనా వార్తలు తాజా

పల్లెల్లో కరోనా వైరస్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గ్రామీణుల్లో అత్యధికులు ముందస్తు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోంది. ఏపీలోని జిల్లాల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య 67,920 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో పట్టణాల్లో 39శాతం కేసులు ఉంటే గ్రామాల్లో 61శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, నెల్లూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంతంలో 78% నుంచి 66% మధ్య కేసులు రికార్డయ్యాయి.  ఆగస్టు 23 నుంచి 29 తేదీల్లో పట్టణాల్లో 44%, గ్రామాల్లో 56% కేసులు వచ్చాయి. కేవలం రెండు వారాల్లోనే వైరస్‌ కేసులు గ్రామాల్లో గణనీయంగా పెరగడం గమనార్హం.

పల్లెలపై పగబట్టిన కరోనా
పల్లెలపై పగబట్టిన కరోనా
author img

By

Published : Sep 21, 2020, 8:48 AM IST

మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడంలో గ్రామీణుల్లో నెలకొన్న నిర్లిప్తత, అలక్ష్యం వైరస్‌ వ్యాప్తికి దోహదపడుతోంది. ఏపీలోని గ్రామాల్లో ఇప్పటికీ గుంపులుగా ఒకే చోట చేరి మాట్లాడుకుంటున్నారు. పనులు చేసే సమయంలోనూ భౌతికదూరాన్ని పాటించడం లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ తొలగించడంతో పెరిగిన ప్రజారవాణాకు తగ్గట్లు కేసులూ నమోదవుతున్నాయి. జులై నుంచే గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఆ తరవాత బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు పునఃప్రారంభయ్యాక అవి మరింత ఎక్కువయ్యాయి. ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు రాకపోకలు సాగిస్తుండటం వల్ల కూడా గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

  • అనంతపురం జిల్లా యాడికి మండలంలో 535 వైరస్‌ కేసులు వచ్చాయి. వీటిలో మండల కేంద్రంలోనే ఏకంగా 256 కేసులు నమోదు కావడం అక్కడి పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. ఇక్కడి వారు తాడిపత్రి, కర్నూలు నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. నార్పల మండలంలో 408 కేసులు వచ్చాయి. నార్పలలోనే 175 కేసులు రికార్డయ్యాయి.
  • కేసులు తక్కువగా ఉన్నాయని భావిస్తున్న కృష్ణా జిల్లాలోనూ..గ్రామీణ ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతుండటం గమనార్హం. ఈ జిల్లాలో తాజాగా ఆదివారం 8 కంటెయిన్‌మెంట్‌ జోన్లు ప్రకటించారు. బాపులపాడు మండలం మడిచర్ల గ్రామం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

విశాఖ, చిత్తూరు జిల్లాల్లో పట్టణ ప్రాంతాల్లోనే...!

  • విశాఖపట్నం జిల్లాలో 2,646 వైరస్‌ కేసులు నమోదైతే...1,955 (74%) కేసులు పట్టణ ప్రాంతాల్లో వచ్చాయి. గ్రామీణ నేపథ్యంలో 691 (26%) కేసులు రికార్డయ్యాయి.
  • చిత్తూరు జిల్లాలో మొత్తం 6,837 కేసులు వస్తే..3,619(53%) పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో (3,218) 47% చొప్పున కేసులు వచ్చాయి.

గిరిజన ప్రాంతాలకు పాకిన కొవిడ్‌

‘‘జంతూరు’’లో 255కు 106 మందికి వైరస్‌

గిరిజన ప్రాంతాలు వైరస్‌ వ్యాప్తికి దూరంగా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో అక్కడ కూడా కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు 90 కిలోమీటర్ల దూరం(ఒడిస్సా హద్దు)లో ఉన్న మెలియాపుట్టి మండలంలో 1,500 కేసులు నమోదయ్యాయి. అయితే 80 కుటుంబాల్లో 255 మంది జనాభా ఉండే ‘జంతూరు’ గ్రామంలో 106 కేసులు నమోదుకావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. వీరంతా వ్యవసాయ కూలీలే. పనుల కోసం చెన్నై, హైదరాబాద్‌ వంటి సుదూర ప్రాంతాలకు వలసవచ్చే వీరిలో ఎక్కువ మంది ఉన్నారు. వీరికి కరోనా వైరస్‌పట్ల తగిన అవగాహన లేదు. దీనికి దగ్గర్లోని చాపర గ్రామంలో 5,000 మంది జనాభాకు 200 కేసులు వచ్చాయి. ఇక్కడి గిరిజనులు కరోనా వైరస్‌ జ్వరాలనూ సాధారణ జ్వరాలుగా భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కనీసం రోజుకు 500పైనే కేసులు వస్తున్నాయి.

ఇదీ చదవండి : దేశవ్యాప్తంగా నేటి నుంచే పాఠశాలలు పునఃప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.