రాష్ట్ర రాజధానిలో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా పోలీసు శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యం విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు వైరస్ బెడద తప్పడం లేదు. తాజాగా సుల్తాన్ బజార్ ఏసీపీ కరోనా బారిన పడ్డారు. ఏసీపీ కుటుంబ సభ్యులకు, డ్యూటీలో ఉన్న వారికి వైరస్ సోకిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
రోజురోజుకూ పోలీస్ శాఖలో వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. క్రాఫ్ట్ డేటాయిలింగ్ సర్వీస్ సహాయంతో వాహనాల్లో వైరస్ వ్యాపించకుండా శుద్ధి చేస్తున్నారు. నూతన టెక్నాలజీతో వివిధ రసాయనాలతో స్ప్రే చేస్తున్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు, భౌతిక దూరం పాటిస్తూ.. నిరంతరం చేతులు శుభ్రం చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: దూబే కోసం పోలీసుల వేట- రౌడీషీటర్ ఇల్లు కూల్చివేత