ETV Bharat / city

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రజలు బెంబేలు - కరోనా కేసుల అప్​డేట్స్​

కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజురోజుకీ జడలు విప్పుతోంది. గురువారం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావటం... అధికారులు, సాధారణ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మొట్టమొదటి సారిగా ఒకేరోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 300, మొత్తం కేసులు ఆరు వేలు దాటాయి.

corona positive registered record cases in telangana
రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ప్రజలు బెంబేలు
author img

By

Published : Jun 19, 2020, 5:23 AM IST

Updated : Jun 19, 2020, 5:44 AM IST

రాష్ట్రంలో మహమ్మారి భారీగా విస్తరిస్తోంది. నిత్యం వందల కేసులు నమోదవుతున్నాయి. గురువారం అత్యధికంగా 352మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఒక్కరోజులో ఇంత భారీ ఎత్తున కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. రికార్డు స్థాయిలో వెలుగు చూసిన కరోనా కేసులు రాష్ట్ర ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో కేసులు భారీగా నమోదవుతున్నందున... మహానగరం పరిసర ప్రాంతాల్లో 50వేల టెస్టులు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించి మూడు రోజులుగా ఆ మేరకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో కేసుల సంఖ్య రెండు రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. బుధవారం 1,096 మందికి కరోనా పరక్షలు చేయగా... 269మందికి, గురువారం 352 మందికి కరోనా నిర్ధారణ అయింది.

రాజదానిలోనే ఎక్కువ

గురువారం నమోదైన కేసుల్లో 302 కేసులు జీహెచ్​ఎంసీ పరిధిలోనివే కావటం గమనార్హం. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్​లో 10 కేసులు నమోదయ్యాయి. మంచిర్యాలలో 4, జనగామ, వరంగల్ అర్బన్​లో 3, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్​నగర్, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్​లో 2 కేసులు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ రూరల్ జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. ఇక తాజాగా నమోదైన కేసులతో కలిసి ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,027మంది కోరనా బారిన పడ్డారు. ఇక తాజాగా 230 మంది డిశ్చార్జ్ కాగా... ఇప్పటి వరకు 3,301మంది కోలుకుని ఇంటికెళ్లారు. ప్రస్తతం 2,531మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం మరో ముగ్గురు మహమ్మారితో మృతి చెందగా... ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 195కి చేరింది.

రాష్ట్రంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించటంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. చిన్నారులు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొంది.

ఇదీ చదవండి: తల్లి ఒడిలో.. దేశ రక్షణలో.. మరిచిపోని జ్ఞాపకాలు

Last Updated : Jun 19, 2020, 5:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.