ఇదీ చదవండి : వలస కూలీ.. బతుకు కూలి
ఏపీలో కొత్తగా 19 కరోనా కేసులు.. ఇద్దరు మృతి - ఏపీ హెల్త్ బులెటిన్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు 502కి పెరిగాయి. నిన్న సాయంత్రం 5 నుంచి ఉదయం 9 వరకు 19 కొత్త కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. కొత్తగా గుంటూరులోని కుమ్మరి బజార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్లు తెలిపింది. ఇప్పటివరకూ కరోనాతో మొత్తం 11 మంది మృతిచెందగా, 16 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని ప్రకటించింది. జిల్లాల్లో కేసులు... గుంటూరు జిల్లాలో కొత్తగా 4 కేసుల నమోదుతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 118 చేరిందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది . పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా 8 కరోనా పాజిటివ్ కేసులు రాగా, కేసుల సంఖ్య 31 చేరిందని తెలిపింది. కర్నూలు జిల్లాలో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని, దీంతో కేసుల సంఖ్య 97కు చేరిందని పేర్కొంది. కృష్ణా జిల్లాలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదుతో.. కొవిడ్ కేసుల సంఖ్య 45 కరోనా చేరిందని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌తో ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో 56, ప్రకాశంలో 42, కడప జిల్లాలో 33, చిత్తూరులో 23, కరోనా పాజిటివ్ కేసులు విశాఖ జిల్లాలో 20, అనంతపురం జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది.
Ap corona health bulletin latest news
ఇదీ చదవండి : వలస కూలీ.. బతుకు కూలి