ETV Bharat / city

కరోనా వేళ.. వారు కరుగుతూ..మనకు వెలుగునిస్తున్నారు! - corona effect on doctors

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ.. అన్నీ తామై నిలుస్తున్నారు వైద్యులు, వైద్య సిబ్బంది. పారిశుద్ధ్య కార్మికులు సైతం కీలక భూమిక పోషిస్తున్నారు. ఆ రక్షకులే ఇప్పుడు కరోనా రక్కసికి బలవుతున్నారు. శనివారం ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో గ్రేడ్‌-1 ల్యాబ్‌ టెక్నీషియన్‌(57) కరోనాతో మృతి చెందారు.గోదావరిఖని సింగరేణి ప్రాంతీయ ఆస్పత్రిలో కరోనా వార్డులో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడూ ఈ వైరస్‌తో మృత్యువాత పడ్డారు.

corona effect on sanitary workers and doctors
కరోనాకు బలవుతున్న వారియర్స్
author img

By

Published : Jul 26, 2020, 8:31 AM IST

గ్రేటర్‌ పరిధిలో కరోనా అలజడి మొదలైనప్పటి నుంచి ఛాతీ ఆసుపత్రిలో అనుమానితులకు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ఇదే ఆసుపత్రిలో నెల రోజుల కిందట ఓ హెడ్‌ నర్సు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేంద్రంలో మరో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. వందలాది శాంపిళ్లు సేకరించడం ద్వారానే శనివారం ఛాతీ ఆసుపత్రిలో మృతి చెందిన వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు భావిస్తున్నారు.

నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. మౌలాలీలో నివాసముంటున్న మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఛాతీ ఆసుపత్రిలో మొత్తం 15 మంది వైద్య సిబ్బంది ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డారు.

క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి..

ల్యాబ్‌ టెక్నీషియన్ల సంఖ్య తక్కువగా ఉండటం.. దానికి తోడు ప్రస్తుతం విధుల్లో ఉన్నవారు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవుతుండటంతో హైదరాబాద్‌లోని పలు కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిలిచిపోతున్నాయి. కుషాయిగూడలోని జమ్మిగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌కు గత బుధవారం వైరస్‌ సోకింది.

అదే రోజు మల్కాజిగిరి నియోజకవర్గంలో వినాయకనగర్‌ యూపీహెచ్‌సీలో ఓ టెక్నీషియన్‌ అస్వస్థతకు గురయ్యారు. బోడుప్పల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న యాంటీజెన్‌ ర్యాపిడ్‌ టెస్టుల కేంద్రంలో మహిళా ల్యాబ్‌ టెక్నీషియన్‌ సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో రెండు రోజులుగా పరీక్షలు నిలిపేశారు. శ్వాబ్‌ సేకరణతో పాటు ఫలితాలు వెలువరించడంతో పని ఒత్తిడికి గురవుతున్నామని సిబ్బంది వాపోతున్నారు.

అత్యాధునిక పరికరాలతో పారిశుద్ధ్య చర్యలు

కరోనా ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య పనుల కోసం మనుషులకు బదులుగా అత్యాధునిక యంత్రాలను వినియోగించనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం హైదరాబాద్‌లో తెలిపారు. ఉద్యోగులకు వైరస్‌ సోకి క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని, పారిశుద్ధ్య సిబ్బంది కొరత చాలా ఉందని మంత్రి అన్నారు. అయినా రాజీపడమని.. ఆధునిక యంత్రాలను వినియోగిస్తామని చెప్పారు.నేల, గోడలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా చేసేందుకు ఈ పరికరాలు ఉపయోగపడతాయన్నారు.

ఆధునిక పరికరాలు కావడంతో 20 మంది కలిసి పనిచేసే చోట ముగ్గురితో వేగంగా చేసేందుకు వీలు కలుగుతుందని, వీటిని కొనుగోలు చేసి కరోనా ఆసుపత్రులకు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ల వ్యర్థాలను తరలించేందుకు సైతం ప్రత్యేక యంత్రాలను కొనుగోలు చేయనున్నామన్నారు.

ఆసుపత్రుల రసాయనిక శుద్ధీకరణకు ప్రత్యేక పరికరాలు వినియోగించనున్నట్లు మంత్రి చెప్పారు. కరోనా బాధితులకు ఇస్తున్న ఆహారాన్ని ఏజెన్సీ సరఫరా చేస్తోందని, వీటిని వండి సరఫరా చేసే సమయానికి ఆహారం చల్లబడుతోందన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆహార పదార్థాలు వేడిగా ఉండేందుకు హాట్‌ప్యాక్‌ వాడతామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.