ETV Bharat / city

అనుబంధాలనూ వదలని మహమ్మారి - ఆన్​లైన్​లో రాఖీల అమ్మకాలు

అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక‌గా జ‌రుపుకునేదే... రాఖీ పండుగ‌. త‌ర‌త‌రాల‌కు చెర‌గ‌ని బంధంగా గుర్తుండాల‌ని క‌ట్టుకునే బంధ‌న‌మే.. ర‌క్షా బంధ‌న్. అలాంటి రాఖీ పండ‌గ‌కు కొవిడ్‌ వ్యాప్తి.. ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌ పాతబస్తీలోని రాఖీ దుకాణాలన్నీ.. కొనేవారు లేక వెలవెల పోతున్నాయి.

corona effect on rakhee sales in telanagana
అనుబంధాలనూ వదలని మహమ్మారి
author img

By

Published : Jul 19, 2020, 5:00 AM IST

అనుబంధాలనూ వదలని మహమ్మారి

ఏటా హైదరాబాద్‌లోని పాతబస్తీ రాఖీ అమ్మకాల కోసం ముస్తాబవుతుంది. న‌వంబ‌ర్ నెల నుంచే ఇక్కడ రాఖీల‌ు త‌యారు చేస్తుంటారు. అయితే ర‌కర‌కాల అంద‌మైన రాఖీలు త‌యారైన‌ప్పటికీ... వాటిని వివిధ ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు ర‌వాణా సౌక‌ర్యాలు లేవని వ్యాపార‌స్థులు అంటున్నారు. ఎప్పుడూ నేరుగా క్రయ విక్రయాలు జరిపే వ్యాపారులు... కొవిడ్‌ కారణంగా ఇప్పుడు ఆన్​లైన్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. హోల్​సేల్​గా రాఖీ అమ్మకాలు జరిపే షాపులు... ఇప్పుడు వెల‌వెలబోతున్నాయి. వ‌చ్చే నెల మొద‌టి వారంలోనే... రాఖీ పండుగ‌ ఉన్నప్పటికీ రిటేల్‌ కొనుగోలుదారులు లేక బోసిపోతున్నాయి.

రాఖీ హోల్​సేల్‌ అమ్మకందారులు శానిటైజ‌ర్‌లను దుకాణాల్లో ఉంచ‌డంతోపాటు... మాస్క్​లు ధ‌రించిన వారికే విక్రయిస్తామంటున్నారు. రాఖీ పండుగ ఎవ‌రి ఇంట్లో వారే జ‌రుపుకునే పండుగ అయిన‌ప్పటికీ... అన్న ఇంటికి చెల్లి... చెల్లి ఇంటికి అన్న వెళ్లాలంటే... క‌రోనా మ‌హ‌మ్మారి అడ్డుగా నిలిచింద‌ని వ్యాపార‌స్థులు వాపోతున్నారు. సొంత వాహ‌నాలు ఉన్న వారు మాత్రమే... కొనుగోలు చేసేందుకు వ‌స్తున్నార‌ని చెబుతున్నారు.

ఇప్పటికే పాత‌బ‌స్తీలో వివిధ ఆకృతిలో ఉన్న రాఖీలు కొలువుదీరాయి. డిజైన‌ర్, ఫ్యాన్సీ, చిన్నారుల కోసం కార్టూన్ రాఖీలు, స్పాంజీ రాఖీలు, రాళ్లు పొదిగిన రాఖీలు, వెండి రాఖీలు ఆక‌ట్టుకుంటున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే... ఈ ఏడాది కూడా అంద‌మైన రాఖీలు మార్కెట్లోకి వ‌చ్చాయి. కానీ... కొనుగోళ్లే ఇంకా ఊపందుకోలేదని దుకాణదారులు అంటున్నారు. ఇక అమ్మకాలకు కేవలం 2 వారాలు మాత్రమే మిగిలిపోయాయని చెబుతున్నారు. అన్ని రంగాల‌పై క‌రోనా ప్రభావం పడినట్లే... రాఖీల అమ్మకాలపై కూడా ప‌డింద‌ని... ఈసారి అమ్మకాలు గతంలో కంటే గణనీయంగా తగ్గే అవకాశం ఉందంటున్నారు.

ఇదీ చూడండి: ఆయోధ్యలో రామాలయ నిర్మాణం అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.