ETV Bharat / city

బడుగులపై కరోనా పిడుగు - బడుగులపై కరోనా పిడుగు

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సగటు మానవుడి జీవనశైలి మారిపోయింది. ఆహారపు అలవాట్లతో పాటు అభిరుచులూ మారాయి. ఇంటి బడ్జెట్‌ పెరుగుతోందని సగటు జీవి ఆవేదన చెందుతున్నాడు. ఏ రోజుకారోజు కష్టించి బతుకుబండి లాగేవారిని మాత్రం కరోనా కాటేస్తోంది.

corona effect on people
బడుగులపై కరోనా పిడుగు
author img

By

Published : Apr 16, 2020, 6:39 AM IST

లేచింది మొదలు హడావుడి.. పిల్లల్ని ఉదయమే బడికి పంపించడం.. ఉరుకులు పరుగులతో ఉద్యోగాలకు...వారాంతం వస్తే సినిమాలు, షాపింగ్‌లు, హోటల్‌ భోజనాలు.. అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్లు.. జల్సాలు.. విందూ వినోదాలు.. ఇదీ కరోనా ముందు పలు కుటుంబాల జీవనశైలి. మహమ్మారి రాకతో పరిస్థితి తలకిందులైంది. అంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఆహారపు అలవాట్లు, అభిరుచులు మారాయి. ఆరోగ్య జాగ్రత్తలు పెరిగాయి. అదే సమయంలో నెలవారీ ఖర్చులు తారుమారవుతున్నాయి. ఇంటి బడ్జెట్‌ పెరుగుతోందని సగటు జీవి ఆవేదన చెందుతున్నాడు. ఏ రోజుకారోజు కష్టించి బతుకుబండి లాగేవారిని మాత్రం కరోనా కాటేస్తోంది. రూపాయి ఆదాయం లేకపోగా పెరిగిన ఖర్చులతో అప్పులపాలవుతున్నట్లు బడుగు జీవి ఆందోళన చెందుతున్నాడు. బయటి ఖర్చులు తగ్గాయని ఆర్థికంగా బాగున్నవారు చెబుతున్నారు.

పెరుగుతున్న ధరలు

కరోనా దెబ్బతో నూనెలు, చింతపండు, బియ్యం, చికెన్‌, మటన్‌ ధరలు పెరుగుతూ ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ‘రోజంతా ఇంట్లో ఉండటం వల్ల ఏసీ, ఫ్యాన్లు, టీవీ వాడకం పెరిగింది. టీ, కాఫీ ఎక్కువసార్లు తాగడం వల్ల అర లీటరు పాల వినియోగం అధికమైంది. 30 రోజులొచ్చే గ్యాస్‌ సిలిండర్‌ 24 రోజులకే అయిపోయింది. శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్‌వాష్‌ లిక్విడ్లకు రూ.వెయ్యి ఖర్చయింది’ అని చంపాపేటకు చెందిన గృహిణి మాధవి చెబుతున్నారు. బంధువుల ఇళ్లకు వెళ్లడం, వాహనాల్లో తిరిగే ఖర్చులు తగ్గినా..ఇంటి ఖర్చు కొంత పెరిగిందని.. రిటైర్డ్‌ ఉద్యోగి వై.రత్నం పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కరోనాకు ముందు సగటున రోజుకు 1,700-1,800 మెగావాట్ల విద్యుత్తు వినియోగం ఉండేది. లాక్‌డౌన్‌తో అంతా ఇంట్లో ఉండటం వల్ల విద్యుత్తు వాడకం 2,600 మెగావాట్లకు పెరిగింది.

corona effect on people
బడుగులపై కరోనా పిడుగు

పెరిగిన గ్యాస్‌ బుకింగ్‌లు

అయిపోయిన వెంటనే దొరకవేమోనన్న కారణంతో వెంటవెంటనే గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఇంట్లో వంటలు కూడా పెరిగాయి. దీంతో సిలిండర్ల బుకింగ్‌లు, వాటితో పాటు ఖర్చులూ పెరిగాయి.

గతంలో: 1.30 లక్షలు

ఇప్పుడు: 1.87 లక్షలు

పైసా ఆదాయం లేదు..ఖర్చులేమో భారం

ఓ అపార్ట్‌మెంట్‌లో ఇస్త్రీ చేస్తా. ఇదే మా కుటుంబానికి జీవనాధారం. రోజంతా పనిచేస్తే రూ.500-600 వచ్చేది. లాక్‌డౌన్‌తో రూపాయి ఆదాయం లేదు. నూనెలు, బియ్యం, చింతపండు ధరలు పెంచేశారు. గతంలో ఇంటి ఖర్చులకు రూ.5 వేలు సరిపోయేది. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అంతా ఇంట్లోనే. పాల వాడకం, భోజనం ఖర్చులు పెరిగాయి. లాక్‌డౌన్‌ నాటి నుంచి రూ.8 వేలు ఖర్చయింది. తెలిసినవాళ్ల దగ్గర రూ.5 వేలు అప్పు చేయాల్సి వచ్చింది. -బండారి బాబు, కుత్బుల్లాపూర్‌

ఖర్చు బాగా తగ్గింది

ఓ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నా. వారాంతం వచ్చిందంటే..షాపింగ్‌, సినిమాలు, బయటి భోజనంతో ఖర్చు భారీగా ఉండేది. ప్రతి వారం ఇదే పరిస్థితి. లాక్‌డౌన్‌తో ఇంటి నుంచే పనిచేస్తున్నా. నెలకు చూస్తే పెట్రోల్‌ ఖర్చు రూ.5 వేలు.. బయటి భోజనాలు, సినిమాలు, షాపింగ్‌ ఖర్చు రూ.10 వేలపైన, ఇతరత్రా రూ.3 నుంచి 4 వేల ఖర్చు తగ్గింది. ఇంట్లో సరకుల ఖర్చు మాత్రం రూ. 10వేల నుంచి 14వేలకు పెరిగింది. ఆఫీసుకు ప్రయాణ సమయం రోజుకు రెండు గంటలు తగ్గడంతో బాగా పనిచేయగలుగుతున్నా.

- చరణ్‌జీత్‌సింగ్‌, చందానగర్‌

పరిశుభ్రత పెరిగింది

కరోనా తర్వాత పరిశుభ్రత పెరిగింది. పొదుపు నేర్చుకుంటున్నాం. అయినప్పటికీ ఇంట్లో ఖర్చులు పెరుగుతున్నాయి. పాలు, కరెంటు, గ్యాస్‌, ఇంటర్‌నెట్‌ వినియోగం అధికమైంది. ఇంట్లో పెద్దోళ్ల మందులకు ప్రతినెలా రూ.3,500 ఖర్చుంటుంది. డిస్కౌంట్లు తగ్గించడంతో ఖర్చు రూ.3,900కు పెరిగింది. రోజంతా ఏసీల వాడకంతో కరెంటు బిల్లు గురించి భయమేస్తోంది. సినిమాలు, పెట్రోలు ఖర్చులు మాత్రం తగ్గాయి. - నారాయణరావు, సికింద్రాబాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.