ETV Bharat / city

భారీగా తగ్గిన పాల అమ్మకాలు.. నష్టపోతున్న పాడి రైతులు - corona effect on milk sales in ap

కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌ దెబ్బకు ఏపీలో పాడిపరిశ్రమ విలవిల్లాడుతోంది. వేసవిలో పాలకు డిమాండ్‌ ఉండాల్సింది పోయి గిరాకీ పడిపోయింది. హోటళ్లు, రెస్టారెంట్లు, టీ బంకులు, మిఠాయి దుకాణాలు, వసతిగృహాలు మూతపడటంతో మొత్తంమీద పాల అమ్మకాలు 3 లక్షల నుంచి 4 లక్షల లీటర్ల వరకు తగ్గిపోయాయి. కొన్ని డెయిరీలు నష్టాలను పూడ్చుకునేందుకు పాల సేకరణ ధర తగ్గించాయి. ఫలితంగా పాడి రైతులు నష్టపోతున్నారు.

corona-effect-on-milk-industry-in-ap
భారీగా తగ్గిన పాల అమ్మకాలు.. నష్టపోతున్న పాడి రైతులు
author img

By

Published : Apr 25, 2020, 7:30 AM IST

ప్రకాశం జిల్లాలో పాడి రైతులకు గతంలో లీటరు పాలకు (10 శాతం వెన్న) రూ.60 నుంచి రూ.62 మధ్య ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.58 చొప్పున ఇస్తున్నారు. దర్శి ప్రాంతంలో చిన్న, పెద్ద డెయిరీలు 2 లక్షల లీటర్ల పైనే పాలను సేకరించేవి. లాక్‌డౌన్‌తో ప్రస్తుతం పాల సేకరణ తగ్గించాయి. ‘

గతంలో పాలను హైదరాబాద్‌కు పంపేవాళ్లమని... అక్కడ అమ్మకాలు తగ్గడంతో పాలను ఒంగోలు తీసుకెళ్లి డెయిరీలో పొడిగా మార్చుతున్నామని రామకృష్ణా డెయిరీ నిర్వాహకుడు యోగిరెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లాలోనూ పాల ధర తగ్గించారు.

కృష్ణా మిల్క్‌ యూనియన్‌ పరిధిలో రోజుకు 3.01 లక్షల లీటర్ల అమ్మకాలు జరుగుతున్నాయని ఎండీ బాబురావు చెప్పారు. సంగం డెయిరీ పరిధిలో సాధారణ అమ్మకాలే జరుగుతున్నాయని... 3.70 లక్షల సేకరణ జరుగుతోందని ఎండీ గోపాలకృష్ణ వివరించారు. ఒంగోలు డెయిరీకి 18 వేల లీటర్ల పాలు వస్తున్నాయని ఇన్‌ఛార్జి ఎండీ పరశురామయ్య తెలిపారు.

కరోనాకు ముందు విశాఖ డెయిరీ పరిధిలో పాల సేకరణ 6.84 లక్షల లీటర్లుండగా... ఇప్పుడు 7.55 లక్షల లీటర్లకు పెరిగింది. అమ్మకాలు 60వేల లీటర్లు తగ్గాయని ట్రస్టు సీఈఓ అడారి ఆనంద్‌ తెలిపారు. ఉత్తరాంధ్రలో రైతుల్ని ఆదుకునేందుకు డెయిరీ తరపున.. 15రోజుల బిల్లు కింద రూ.25.83 కోట్లు ముందే చెల్లిస్తున్నామని వివరించారు.

ఒంగోలు డెయిరీలో మార్చి 28 తర్వాత 250 టన్నుల పాలపొడి ఉత్పత్తి చేశారు. కృష్ణా మిల్క్‌ యూనియన్‌ పరిధిలో రూ.180 కోట్ల విలువైన పాలపొడి, వెన్న పేరుకుపోయాయి. పాలపొడికీ డిమాండ్ లేక కిలో రూ.340 నుంచి రూ.220కి తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.2వేల కోట్ల పాల పొడి, వెన్న నిల్వలున్నాయని అంచనా.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.