కరోనాను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఫిట్‌నెస్ వ్యాయామాలు చేయిస్తున్నట్లు జిమ్‌ల నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాస సమస్యలు అధిగమించేలా శిక్షణ ఇస్తున్నామని వివరిస్తున్నారు. వైరస్ వ్యాప్తిచెందకుండా వ్యాయామశాలలను రెండుగంటలకు ఒకసారి పూర్తిగా శానిటైజేషన్ చేయడం సహా . థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నామని.. మాస్క్, భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.
"ప్రతీ ఇంట్లోనూ కరోనాతో ఆందోళన నెలకొంది. చిన్నాపెద్దా శారీరక దృఢత్వంపై దృష్టి పెడితే మంచిది. అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. జిమ్‌కు రావడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మంచి ఆహార నియమాలు పాటించేలా చూస్తాం. జిమ్‌లో గంటకోసారి శానిటైజేషన్‌తో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడున్న సమయం సరిపోవడం లేదు. ఉదయం 5 గంటలకు తెరిచి.. రాత్రి 8 గంటలకే జిమ్‌లు మూసివేస్తున్నాం. మరికొంచెం సమయం పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం."
- వ్యాయామ శిక్షకుడు
గ్రేటర్ పరిధిలో సుమారు 150 వరకు పెద్ద జిమ్‌లు ఉన్నాయి. చిన్నవి 700లకు పైగానే ఉంటాయని జిమ్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. శానిటైజేషన్ తదితర ఖర్చులు పెరిగినా ఫీజులు మాత్రం పాతవే వసూలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని జిమ్ సెంటర్ల యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.