ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్ : ఆహార శుద్ధి కేంద్రాల్లో నిలిచిన ఉత్పత్తి

author img

By

Published : Apr 12, 2020, 7:23 PM IST

ఆహార శుద్ధి పరిశ్రమలపై లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. కార్మికులు హాజరుకాకపోవడం, రవాణా నిలిచిపోవడం వల్ల ఉత్పత్తి నిలిచిపోయింది. గుజ్జు తయారీ సైతం నిలిచిపోయి టమాటా ధర పతనమైంది. చిత్తూరు, కడప జిల్లాల్లో 30 ఆహార శుద్ధి పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 18 వరకు టమాటా గుజ్జు తయారు చేస్తాయి. ఒక్కో పరిశ్రమకు రోజుకు 150 టన్నుల వరకు టమాటా అవసరం. కొన్నాళ్లుగా వీటిలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.

కరోనా ప్రభావం వల్ల నిలిచిన టామాటా గుజ్జు ఉత్పత్తి

పరిశ్రమల మూసివేతకు కారణాలెన్నో:

కూలీలు పనికి రాకపోవడం, ఏదైనా ఇబ్బంది ఎదురైతే తమను బాధ్యులుగా చేస్తారేమోనన్న భయం యజమాన్యాల్లో ఉండటం వల్ల ఆహార శుద్ధి పరిశ్రమలు పనిచేయట్లేదు. కొందరు డ్రైవర్లు వాహనాలు బయటకు తీయకపోవడం, ప్యాకింగ్‌కు అవసరమయ్యే ముడి సామగ్రి లభించకపోవడం టమాటా గుజ్జు తయారీకి ఆటంకాలుగా పరిగణించవచ్చు.

సహాయ కేంద్రాలు సత్వరం స్పందిస్తేనే:

వాహనాలను పోలీసులు ఆపినప్పుడు జిల్లా, రాష్ట్ర స్థాయిలోని సహాయ కేంద్రాలకు ఫోన్‌ చేసినా.. సరైన స్పందన లేదని యాజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాన్ని నిలిపేశారన్న సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఇవీ చూడండి : నిర్మల్ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.