ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్థలు రూ.1,33,34,844 విరాళం అందించాయి. కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ లక్ష రూపాయలు, భవాని కాస్టింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 5 లక్షల విరాళం అందించాయి.
ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయిస్ యూనియన్ విజయవాడ 14 లక్షల 20 వేలు, వేద సీడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 10 లక్షలు, ఏపీ ఆయిల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పీవీఎస్‌ఎస్ మూర్తి 15 లక్షల విరాళం ఇచ్చారు.
కాళేశ్వరీ రిఫైనరీ అండ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ 25 లక్షలు, సహా పలు సంస్థలు విరాళం ఇచ్చాయి. చెక్కులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అందజేశారు.
ఇదీ చదవండీ : 'పీఎం, సీఎం ఎన్నికలపై మాత్రమే దృష్టి పెట్టారు'