ETV Bharat / city

ఏపీలో పరీక్షించిన ప్రతి 100లో 7.11 మందికి కరోనా

ఏపీలో కరోనా విజృంభణ మరింత కొనసాగుతోంది. పరీక్షలు నిర్వహించిన ప్రతి వంద మందిలో ఏడుగురికి పాజిటివ్​గా నిర్ధరణ అవుతోంది. కొద్ది రోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం. కొత్తగా మరో 1,178 మందికి వైరస్​ సోకింది. మరణాల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో పరీక్షించిన ప్రతి 100లో 7.11 మందికి కరోనా
ఏపీలో పరీక్షించిన ప్రతి 100లో 7.11 మందికి కరోనా
author img

By

Published : Jul 8, 2020, 8:48 AM IST

ఏపీలో కొవిడ్ మహమ్మారి రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది. గతంలో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొత్తగా 16,238 మందికి పరీక్షలు నిర్వహించగా...1178 మందికి పాజిటివ్‌ వచ్చింది. అంటే పరీక్షలు నిర్వహించిన ప్రతి వంద మందిలో 7.11 మందికి కరోనా సోకుతోంది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలతో పోలిస్తే ఈ సంఖ్య 1.76 శాతంగానే ఉన్నా.. తొలినాళ్లతో పోలిస్తే ఇప్పడు పాజిటివ్ కేసుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2,257 మందికి కరోనా సోకగా... అందులో 898 మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వారే. తెలంగాణ నుంచి వెళ్లిన వారిలోనూ ఎక్కువ మందికి పాజిటివ్ వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 420 మందికి కరోనా సోకగా...వీరిలో 337 మంది కువైట్‌ నుంచి వచ్చిన వారే ఉన్నారు.

గుంటూరులో ఉద్ధృతి

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. రెండు రోజుల్లోనే 480 మందికి పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కేంద్రంలో కేసులు పెరుగుతున్నాయి. రెండు రోజుల్లోనే ఏకంగా 281 కేసులు బయటపడ్డాయి.

కొత్తగా తాడేపల్లిలో 24, తెనాలిలో 21, మంగళగిరిలో 8, దాచేపల్లి, వినుకొండలో ఏడు కేసులు బయటపడ్డాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో మళ్లీ లాక్‌డౌన్ విధించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని దిశ పోలీస్‌స్టేషన్ ఎస్సైకి కరోనా సోకింది. సోమవారం ఇదే స్టేషన్‌ను డీజీపీ గౌతమ్‌సవాంగ్ పరిశీలించడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

ఏపీలో కరోనా కేసులతోపాటు మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 6 రోజుల్లోనే 65 మంది కరోనాతో మృతిచెందారు. కొత్తగా మరో 13 మంది కన్నుమూశారు. మార్చి, ఏప్రిల్, మే నెలలో 72 మంది చనిపోగా...ఒక్క జూన్‌ నెలలోనే 115 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల్లో 4వ వంతు ఈ వారం రోజుల్లోనే సంభవించాయి.

ఇవీచూడండి: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి... కొత్తగా మరో 1879 కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.