రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,33,134 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,897 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 15 మంది మరణించారు.
రోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,409కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,306 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 182 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: రూ.100కే కరోనా టెస్టింగ్ కిట్- 10 నిమిషాల్లోనే రిజల్ట్!