తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,32,996 నమూనాలను పరీక్షించగా 1,933 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు కరోనా వారిన సోకిన సంఖ్య 5,93,103కి చేరింది. తాజాగా 16 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,394కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.
తాజాగా 3,527 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25,406 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 165 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: ap corona cases: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు